'ఏజెంట్' సినిమా బడ్జెట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు అయిన అక్కినేని అఖిల్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్కినేని అఖిల్ కొన్ని రోజుల క్రితం విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. కెరియర్ లో మొట్ట మొదటి విజయాన్ని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో బాక్సాఫీసు దగ్గర  అందుకున్న అక్కినేని అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ మూవీ తో సాక్షి వైద్య టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమాను ఆగస్టు 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది అని, అందుకే ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్లు బయటకి రావడం లేదు అని అప్పట్లో కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఆ వార్తలు అన్ని అవాస్తవమని ఈ సినిమా ప్రొడ్యూసర్ అనిల్ సుంకర సోషల్ మీడియా ద్వారా తెలియజేసి ఆ రూమర్లకు చెక్ పెట్టాడు. ఇది ఇలా ఉంటే ఏజెంట్ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.

 ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి అయ్యింది. ప్రస్తుతం కూడా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా కోసం ప్రొడ్యూసర్ 80 కోట్ల వరకు బడ్జెట్ ఖర్చు పెట్టే విధంగా ప్రణాళికలను వేసుకున్నట్లు తెలుస్తోంది.  కేవలం కెరియర్ లో ఒకే ఒక్క విజయం మాత్రమే ఉన్న అఖిల్ మూవీ కి ఈ రేంజ్ బడ్జెట్ ను కేటాయించడం అంటే నిర్మాత సాహసమే అని కొంత మంది అంటుంటే...  సినిమా కనుక పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నట్లు అయితే ఈ బడ్జెట్ పెద్ద విషయం ఏమీ కాదు అని మరి కొంత మంది అంటున్నారు. మరి ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: