వామ్మో : ఎన్టీఆర్ 30 .... ఇక అరాచకమే .... ??

GVK Writings
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ త్వరలో ఒక భారీ పాన్ ఇండియా మూవీ తీయనున్న విషయం తెలిసిందే. ఇటీవల వరుసగా విజయాలు సొంతం చేసుకుంటూ దూసుకెళ్తున్న ఎన్టీఆర్, లేటెస్ట్ గా రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ మూవీతో మరొక పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకున్నారు. రామ్ చరణ్ మరొక హీరోగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్ల పైచిలుకు కలెక్షన్ కొల్లగొట్టింది.
ఇక ఎన్టీఆర్ తన తదుపరి కొరటాల శివ తో చేయనున్న కెరీర్ 30 మూవీపై గట్టిగా దృష్టి పెట్టారు. గతంలో కొరటాల శివ తో ఎన్టీఆర్ వర్క్ చేసిన జనతా గ్యారేజ్ మూవీ ఎంతో పెద్ద సక్సెస్ కొట్టింది. దానితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా ఎన్టీఆర్ 30 మూవీపై విపరీతంగా ఏర్పడ్డాయి. ఒక స్టార్ నటి జూనియర్ ఎన్టీఆర్ కి జోడీగా నటించనున్న ఈ మూవీకి అనిరుద్ స్వరాలు సమకూర్చనుండగా యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ వ్యయంతో నిర్మించనున్నాయి. ఇటీవల ఆచార్య మూవీ ఘోర పరాజయంతో కెరీర్ పరంగా కొంత ఢీలా పడ్డ దర్శకుడు కొరటాల శివ, ఎలాగైనా ఎన్టీఆర్ 30 మూవీని ఎంతో భారీ సక్సెస్ చేసి, మళ్ళి కెరీర్ పరంగా మంచి క్రేజ్ సంపాదించేందుకు సిద్ధం అవుతున్నారట.
ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉండడంతో పాటు సినిమా యొక్క కథ, కథనాలు యువత, మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటాయని, ఆ విధంగా భారీ యాక్షన్ తో కూడిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు శివ ఈ స్క్రిప్ట్ ఎంతో జాగ్రత్తగా సిద్ధం చేసారని ఇన్నర్ వర్గాల టాక్. అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా గ్రాండియర్ గా తెరక్కించి, ఎట్టి పరిస్థితుల్లో అందరి అంచనాలు మించేలా తీసేందుకు యూనిట్ గట్టిగా సన్నద్ధం అయిందట. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే, రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ 30 మూవీ విడుదల తరువాత బాక్సాఫీస్ దగ్గర పెద్ద అరాచకమే సృష్టించే అవకాశం కనపడుతోందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: