క్రేజీ హీరో తో సినిమా ప్లాన్ చేస్తున్న దిల్ రాజు..!

Pulgam Srinivas
ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దిల్ రాజు టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంతో మంది స్టార్ హీరోల సినిమా లకు నిర్మాతగా వ్యవహరించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న టాప్ ప్రొడ్యూసర్ లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంతో మంది హీరోలతో మూవీ లను నిర్మించి ఎన్నో విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న దిల్ రాజు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ ప్రొడ్యూసర్ లలో ఒకరిగా కొనసాగుతున్నడు.

దిల్ రాజు ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా మూవీ పై కూడా ఫోకస్ పెట్టాడు. అందులో భాగంగా ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఉన్న దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. రామ్ చరణ్ , శంకర్ మూవీ తో పాటు తలపతి విజయ్,  వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మరో సినిమాను దిల్ రాజు తెరకెక్కిస్తున్నాడు.  ఇది ఇలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దిల్ రాజు మరో క్రేజీ హీరో ను  సెట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

కే జి ఎఫ్ చాప్టర్ 1 మరియు చాప్టర్ 2  సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న యష్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించే ప్లాన్ లో దిల్ రాజు ఉన్నట్లు తెలుస్తోంది.  త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం దిల్ రాజు కూడా రాబోయే కొంత కాలం లో తమ బ్యానర్ నుండి రెండు,  మూడు భారీ సినిమాలకు సంబంధించిన అనౌన్స్మెంట్ లో రానున్నట్లు కూడా ప్రకటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: