బాలయ్య... బోయపాటి మూడు సార్లు అదే బీభత్సం..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్ లకు ఫుల్ క్రేజ్ ఉంటుంది.  అలా ఆ కాంబినేషన్ లకు ఫుల్ క్రేజ్ ఉండడానికి ప్రధాన కారణం... వారి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడమే.  తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్ కు ఫుల్ క్రేజ్ ఉంది. ఇప్పటి వరకు వీరి కాంబినేషన్ లో మూడు సినిమాలు తెరకెక్కాయి. ఈ మూడు సినిమాలు కూడా మాస్ ప్లస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కు చెందిన సినిమాలే. ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయలను సాధించాయి. దానితో బాలయ్య అభిమానులు వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఏంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.  ఇది ఇలా ఉంటే వీరి కాంబినేషన్లో తెరకెక్కిన మూడు సినిమాలు కూడా ఒక రేర్ పిట్ ని టచ్ చేశాయి. దాని గురించి తెలుసుకుందాం.
ఈ రోజుల్లో సినిమా థియేటర్లలో 50 రోజులు ఆడటం అనేది చాలా గొప్ప విషయం. ఏదైనా ఒక సినిమా బ్లాక్ బస్టర్ టాప్ తెచ్చుకున్నట్లు అయితే ఆ సినిమా 50 రోజుల వరకు థియేటర్లో ప్రదర్శించబడే అవకాశాలు ఉన్నాయి. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా సినిమా అఖండ ఒకే థియేటర్ లో ఏకంగా 175 రోజుల పాటు ప్రదర్శించబడింది. ఇది ఇలా  ఉంటే బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన ఒక్క అఖండ సినిమా మాత్రమే కాకుండా వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సింహ , లెజెండ్ సినిమాలు కూడా 175 రోజుల పాటు థియేటర్ లలో ప్రదర్శించబడ్డాయి. ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సింహా, లెజెండ్ , అఖండ మూడు సినిమాలు కూడా 175 రోజుల పాటు థియేటర్ లలో ప్రదర్శించబడ్డాయి. అలాగే ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను సాధించడం మాత్రమే కాకుండా,  బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ ల వర్షం కురిపించాయి. ఇలా ఇప్పటి వరకు వీరి కాంబినేషన్లో తెరకెక్కిన మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయలు సాధించడంతో వీరి కాంబినేషన్లో మరో సినిమా ఎప్పుడు వస్తుందా... అని బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: