'సలార్' మూవీ కోసం రెస్ట్ లేకుండా వర్క్ చేస్తున్న ప్రభాస్..!

Pulgam Srinivas
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి భారీ సినిమాల్లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే ప్రభాస్ 'బాహుబలి' సినిమా తర్వాత సాహో , రాధే శ్యామ్ లాంటి రెండు భారీ బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్  భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సహో , రాధే శ్యామ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ కు కాస్త నిరాశనే మిగిల్చాయి.

 ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ 'కే జి ఎఫ్' సినిమా తో దర్శకుడిగా పాన్ ఇండియా రేంజ్ లో అదిరిపోయే క్రేజ్ ను సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కొంత భాగం పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో ప్రభాస్ పై అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సలార్ చిత్ర బృందం చిత్రీ కరిస్తున్న యాక్షన్ సన్నివేశాల కోసం ప్రభాస్ నిరంతరాయంగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. సలార్ సినిమా ప్రస్తుత షెడ్యూల్ 'ఆర్ ఎఫ్ సి' లో జరుగుతోంది.

ప్రస్తుతం షెడ్యూల్ లో చిత్ర బృందం తెరకెక్కిస్తున్న యాక్షన్ సన్నివేశాలు ఈ సిని మాకే హైలెట్ గా నిలవనున్నాయిట్లు తెలుస్తోంది. సలార్ సినిమాలో ప్రభాస్ సరసన అందాల ముద్దు గుమ్మ శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకు రవి బుస్రుర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.  కే జి ఎఫ్ సినిమా అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయం సాధించ డంతో సలార్ సినిమా పై ప్రభాస్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: