మెగా ఫ్యాన్స్ అసహనంలో వరుణ్ తేజ్ ?

Seetha Sailaja

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొంతవరకు గంభీరంగా ఉంటాడు. దీనికితోడు మెగా అభిమానులకు జోష్ ను ఇచ్చే విధంగా ఉపన్యాసాలు ఇవ్వలేదు. చాల కూల్ గా ఉండే వరుణ్ తేజ్ అవసరంలేని మాటలు మాట్లాడడు అని కూడ అంటూ ఉంటారు. ‘గని’ సూపర్ ఫ్లాప్ తో వరుణ్ తేజ్ కి షాక్ తగిలింది. దీనితో నేడు విడుదలకాబోతున్న ‘ఎఫ్ 3’ విజయం వరుణ్ తేజ్ కు అత్యంత కీలకంగా మారింది.

ఇలాంటి పరిస్థితులలో వరుణ్ తేజ్ తీరువల్ల మెగా అభిమానులు కొద్దిగా బాధ పడినట్లుగా సోషల్ మీడియాలో వార్తల హడావిడి జరుగుతోంది. సాధారణంగా మెగా యంగ్ హీరోలు ఏదైనా ఊరుకి వస్తే అక్కడ ఉండే మెగా హీరోల అభిమాన సంఘాలకు తెలియచేస్తూ ఉంటారట. అలాంటి సమాచారం మెగా అభిమానులకు అందిన వెంటనే మెగా అభిమానులు మెగా కుటుంబ హీరోలు వచ్చే ఆ ప్రత్యేక ప్రాంతానికి వచ్చి బొక్కేలతో సెల్ఫీ లతో హడావిడి చేయడం పరిపాటి.

అనీల్ రావిపూడి తో కలిసి వరుణ్ తేజ్ విజయవాడ వచ్చినట్లుగా ఆఖరి నిముషంలో మెగా అభిమానులకు తెలియడంతో చాలామంది మెగా అభిమానులు వరుణ్ తేజ్ ను కలవడానికి వచ్చారట. అయితే స్వతహాగా తక్కువగా మాట్లాడే వరుణ్ తేజ్ తన దగ్గరకు వచ్చిన మెగా అభిమానులతో తక్కువగా మాట్లాడటంతో వారంతా నోచ్చుకున్నట్లుగా సోషల్ మీడియాలో గాసిప్పుల హడావిడి జరుగుతోంది.

దీనితో ఈరోజు విడుదల అవుతున్న ‘ఎఫ్ 3’ పై మెగా అభిమానుల స్పందన ఎలా ఉంటుంది అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ సినిమాలకు స్పందించినంత వేగంగా మిగతా మెగా హీరోల పట్ల మెగా అభిమానులు పెద్దగా స్పందించరు. అల్లు అర్జున్ మెగా కుటుంబ బ్యాక్ గ్రౌండ్ తో ఎదిగినప్పటికీ ఇప్పుడు తనకు తానుగా టాప్ స్థానంలో ఉంటూ తనకంటూ సొంతమైన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను ఏర్పరుచుకున్న విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: