ఎన్టీఆర్ - హీరోయిన్ సమీరా రెడ్డి ప్రేమ గురించి.. ఈ విషయం మీకు తెలుసా?

praveen
సాధారణంగా సినీ సెలబ్రిటీల గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వచ్చి హాట్ టాపిక్గా  మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు కొన్ని నిజాలు అయితే కొన్ని మాత్రం పుకార్లు గానే మిగిలిపోతుంటాయి. ముఖ్యంగా హీరో హీరోయిన్ల కు సంబంధించిన ప్రేమ వ్యవహారాల వార్తలు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇక అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా ఇలాంటి వార్త బయటకు వచ్చింది అనే విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ ఒక హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి పోయాడు అంటూ అప్పట్లో ఒక వార్త సంచలనం సృష్టించింది.

 ఇక ఇలా జూనియర్ ఎన్టీఆర్ ప్రేమలో మునిగితేలిన హీరోయిన్ ఎవరో కాదు సమీరా రెడ్డి.  జూనియర్ ఎన్టీఆర్ సమీరా రెడ్డి కాంబినేషన్లో అశోక్, నరసింహుడు అనే రెండు సినిమాలు వచ్చాయి. సినిమాలు కూడా ఎందుకో ప్రేక్షకుల ఆదరణ మాత్రం పొందలేక డిజాస్టర్గా మిగిలిపోయాయ్. కాగా రెండు సినిమాలు హిట్ కాకపోయినప్పటికీ ఇద్దరు హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టింది అంటే అప్పట్లో ఒక వార్త బయటకు వచ్చింది. వీరిద్దరు కూడా కెమెరా కంటపడకుండా చెట్టా పట్టా లేసుకొని తిరుగుతున్నారు అంటూ అందరూ చర్చించుకున్నారు.

 కానీ ఆ తర్వాత మాత్రం వీరిద్దరు అనుకోని విధంగా కొన్ని కారణాలవల్ల విడిపోయారు అంటూ అంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ అసలు విషయం ఏంటి అనేది ఆ తర్వాత బయటకు వచ్చింది. వీరిద్దరి మధ్య ఎలాంటి ప్రేమ లేదని కేవలం స్నేహితులు మాత్రమే అన్న విషయం తేలింది   రెండు సినిమాల్లో నటించిన కారణంగా వీరిద్దరి మధ్య స్నేహబందం ఏర్పడింది తప్ప ప్రేమ బంధం లాంటిది లేదు అన్న విషయంపై క్లారిటీ వచ్చింది. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతినీ పెళ్లి చేసుకున్నాడు. సమీరా రెడ్డి అక్షయ్ అనే బిజినెస్ ను పెళ్లి చేసుకోవడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: