బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 1: అట్టర్ ప్లాప్.. ఎందుకంటే?

Purushottham Vinay
ఇక తెలుగు లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 1 పూర్తి అయిన విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత హోస్ట్ కింగ్ నాగార్జున ఈసారి ఓటీటీ లో బిగ్ బాస్ ఉండదు అని ఇంకా ఒకవేళ ఉన్నా కూడా బిగ్ బాస్ నాన్ స్టాప్ ఉండదు అని ప్రకటించిన విషయం కూడా తెలిసిందే.అంటే ఇక కింగ్ నాగార్జున మాటలను బట్టి చూస్తే బిగ్ బాస్ షో ని బుల్లితెర పైనే ప్రసారం చేయబోతున్నారన్నమాట. అందుకు గల కారణం ప్రస్తుతం ఓటీటీ లో వస్తున్న సినిమాలు ఇంకా అలాగే వెబ్ సిరీస్ లకు మంచి డిమాండ్ ఉంటుంది. అందువల్లే బిగ్ బాస్ నాన్ స్టాప్ షోని లైవ్ లో చూడటం అనేది సాధ్యం కాలేదు.ఇక అంతేకాకుండా ఈ బిగ్బాస్ షో ని 24 గంటలపాటు చూడటానికి కూడా ప్రేక్షకులు కూడా ఆసక్తిని కనబరచడం లేదు. ఈ బిగ్ బాస్ సీజన్ 1 వల్ల బిగ్ బాస్ ప్రేమికులకు మొబైల్ ఛార్జింగ్ ఇంకా అలాగే మొబైల్ లో డేటా అనేది అయిపోవడం అనేది తీవ్ర అసంతృప్తి పరిచింది.


ఇక ఒకరోజు ముందుగానే లైవ్ కట్ చేయడం ఇంకా ముందుగానే లైవ్ లో ఏం జరుగుతోంది అనేది సోషల్ మీడియా ద్వారా తెలిసిపోవడం వల్ల ఈ షోపై ఆసక్తి కూడా తగ్గిపోయింది. దీనివల్ల బిగ్ బాస్ నాన్ స్టాప్ లైవ్ అనేది సందేహం లేకుండా ఫెయిల్ అయ్యిందనే చెప్పవచ్చు.దీనితో ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ 24×7 లైవ్ నీ ఆపేశారు. ఇక బిగ్ బాస్ సీజన్ 2 అనేది ఓటీటీలో వేరేవిధంగా డిజైన్ చేస్తారా? లేకపోతే ఓటీటీ సీజన్ ని ఆపేస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇకపోతే తాజాగా అందిన సమాచారం ప్రకారం అయితే, సీజన్ 2ని వేరే విధంగా ప్లాన్ చేసి చేస్తారట. మరోవైపు స్టార్ మాటివిలో బిగ్ బాస్ సీజన్ 6కి కూడా ప్లాన్ లు నడుస్తున్నాయి.టెలివిజన్ లో టెలికాస్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా స్పాన్సర్స్ కి కొదవ ఉండదు అని ఈజీగా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: