చిరంజీవి సినిమాతో పోటీ పడి గెలిచిన ఆర్ నారాయణమూర్తి ?

VAMSI
తెలుగు ప్రేక్షకుల కు ఆర్ నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సినిమాలు ఎపుడు సమాజానికి మంచి మెసేజ్ ను ఇచ్చే విధంగా ఉంటాయి. అలాగే ప్రజలను చైతన్య పరిచేలా వారిలో మానవతా దృక్పథాలు మేలుకొనేలా ఉంటాయి. విప్లవం అనే పేరు వింపడితే మన కళ్ళలో కదలాడే రూపం ఆర్ నారాయణ మూర్తి అన్నట్లుగా ఆయన అందరి గుండెల్లో స్థానం పొందారు. స్టార్ హీరోల స్థాయిలో ఈయనకు భారీ ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే ఈయనకు మరియు మెగాస్టార్ చిరంజీవి కి సంబందించిన ఒక ఆసక్తికర విషయం ఇపుడు మీ ముందుకు తీసుకొచ్చాం.
 చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి ఒక మహా దిగ్గజం. చిరు సినిమా వస్తుంది అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సందడే సందడి. చిరు సినిమా ముందు నిలబడి బరిలోకి దిగడం అంటే దాదాపు ఓటమికి ఎదురెళ్ళడమే అన్నది ఇండస్ట్రీ లెక్క... అంతగా చిరు సినిమాకి ఒక బ్రాండ్ ఉంది. హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆయన చిత్రాలకు ఆదరణ మాత్రం ఏమాత్రం తగ్గదు. అందుకే చిరు సినిమా రిలీజ్ అవుతుంది అంటే మరే స్టార్ హీరో దగ్గర్లో తమ చిత్రాలను విడుదల చేసిన సందర్భాలు చాలా తక్కువే... అంటే ఇక్కడ విషయం ఏమిటంటే మెగాస్టార్ తో పోటీ పడేందుకు దర్శక నిర్మాతలు ఎవరు కూడా సాహసించరు. తోటి స్టార్ హీరోలు సైతం చిరు సినిమాకు పోటీగా వచ్చేందుకు ఇష్టపడరు. అలాంటిది చిరంజీవి సినిమాకి పోటీగా తన సినిమాని దింపి ఆయన సినిమా మీద విజయం సాధించిన ఒక నటుడి చిత్రం ఉంది అంటే నమ్మశక్యంగా ఉందా? ఆయనేమైనా స్టార్ హీరోను అదే కాదు.
ఆయనే ఆర్.నారాయణ మూర్తి. స్టార్ హీరో కాకపోయినా స్టార్ డం పుష్కలంగా ఉన్న ఈయన చేసిన ఒక చిత్రం మెగాస్టార్ సినిమాతో పోటీపడి సక్సెస్ అందుకుంది అంటే సాధారణమైన విషయం కాదు.  దర్శకరత్న దాసరి నారాయణ గారు తన సొంత నిర్మాణ సంస్థలో నారాయణ మూర్తిని ప్రధాన పాత్రలో పెట్టి 'ఒరేయ్ రిక్షా' అనే టైటిల్ తో ఒక సినిమాని తీసి రిలీజ్ చేశారు. అయితే ఎటువంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది, కలెక్షన్ల కనక వర్షం కురిపించింది. ఒక అన్న తన చెల్లెల్ని పోషించడానికి రిక్షా తొక్కుకుంటూ కష్టం దారబోస్తూ ఒక్కో రూపాయి పోగేసి తన చెల్లెలికి అండగా నిలిచిన అన్నగా ఆర్ . నారాయణ మూర్తి ఇందులో కనిపించగా, జనం ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు.
అయితే అదే రిక్షా కార్మికుడి బ్యాక్ డ్రాప్ తో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కోడి రామ కృష్ణ గారి డైరెక్షన్ లో వచ్చిన రిక్షావోడు చిత్రం కూడా నెల గాప్ లో రిలీజ్ కాగా ఈ సినిమా ఫ్లాప్ అయింది.   అంతేకాదు నెల తర్వాత రిలీజ్ అయిన రిక్షా వోడు సినిమా థియేటర్స్ కు వచ్చి  వెళ్లిపోయినా కూడా ఒరేయ్ రిక్షా సినిమా మాత్రం ఎప్పటికీ థియేటర్స్ లో విజయవంతం గా రన్ అయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: