పెరిగిపోతున్న అనుష్క నైరాశ్యం !

Seetha Sailaja
‘బాహుబలి’ తరువాత అనుష్క జాతీయ స్థాయిలో టాప్ హీరోయిన్ గా ఎదిగిపోతుందని ఎన్నో కథనాలు వచ్చాయి. అయితే వాటికి భిన్నంగా అనుష్క కెరియర్ కొనసాగుతోంది. 40 సంవత్సరాలు దాటిపోయిన అనుష్క స్వతహాగా యోగా టీచర్ అయినప్పటికీ తనకు పెరిగిన బరువును ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె తగ్గించుకోలేక పోతోంది. దీనితో టాప్ హీరోలు ఎవరు తమ సినిమాలలో ఆమెకు అవకాశాలు ఇవ్వడంలేదు.

‘నిశ్శబ్దం’ మూవీ తరువాత ఆమెతో సినిమాలు చేయాలని కొంతమంది యంగ్ డైరెక్టర్స్ ప్రయత్నాలు చేసినప్పటికీ కనీసం ఆ దర్సుడు చెప్పే కథలను వినడానికి కూడ అనుష్క ఆశక్తి కనపరచలేదు అని అంటారు. దీనికితోడు ఆమెను సినిమాలో బుక్ చేసుకుంటే ఆమెకు ఇచ్చే పారితోషికంతో పాటు ఆమెను సన్నగా చూపించడానికి అవసరం అయిన విజువల్ ఎఫెక్ట్స్ కోసం విపరీతంగా ఖర్చు అవుతోంది అని కొందరు నిర్మాతలు చేసిన కామెంట్స్ ఆమెను విపరీతంగా బాధ పెట్టాయి అంటారు.

లేటెస్ట్ గా ఒక నిర్మాణ సంస్థ ఆమెతో ఒక వెబ్ సిరీస్ తీద్దామని ప్రయత్నించినప్పుడు కూడ ఆమె నో చెప్పింది అన్న వార్తలు వస్తున్నాయి. ఆమె సమకాలీకులు అయిన సమంత నయనతార లాంటి టాప్ హీరోయిన్స్ ఇప్పటికీ వరసపెట్టి సినిమాలు చేస్తుంటే అనుష్కకు ఈ నైరాశ్యం ఏమిటి అంటూ మరికొందరు ఆశ్చర్యపోతున్నారు. అనుష్కకు ఎంతో సన్నిహితులైన యూవీ క్రియేషన్స్ సంస్థ కూడ తమ లేటెస్ట్ మూవీలో హీరోయిన్ గా అనుష్కను ఒప్పించడానికి చాల కష్టపడవలసి వచ్చింది అన్న టాక్ కూడ ఉంది.

అయితే ఈ నైరాశ్యం అంతా అనుష్కకు తన పెరిగిన బరువు గురించా లేదంటే తన పెళ్ళి గురించా అన్న సందేహాలు మరికొందరిలో వస్తున్నాయి. దక్షిణాది సినిమా రంగంలో నటనలో ఎలాంటి పాత్రను అయినా నటించగల అతి తక్కువ హీరోయిన్స్ లో అనుష్క ఒకరు. ఆమె ఇలా నైరాస్యంతో మరికొన్ని సంవత్సరాలు ఇలాగే కొనసాగితే ఆమె ఇక నుంచి ఇండస్ట్రీకి శాస్వితంగా దూరం అయినట్లే అన్న అభిప్రాయం చాలామందికి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: