అఖిల్ కోసం నాగార్జున కమర్షియల్ ప్లాన్!

Purushottham Vinay
అక్కినేని ఫ్యామిలీ హీరో నాగార్జున చిన్న కొడుకు అఖిల్ అక్కినేని మనం సినిమాలో చిన్న కామియో రోల్ చేసి బాగానే ఆకట్టుకున్నాడు. కానీ, ఆ తర్వాత ఎన్నో అంచనాలతో హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుసగా మూడు సినిమాలు చేస్తే వరుసగా ఒక్కోటి ఫ్లాప్‌గా ఇంకోటి యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకున్నాయి.ఇక దాంతో ఎలాగైనా కానీ అఖిల్‌ను హీరోగా నిలబెట్టాలని నాగార్జున ఎన్నో రకాల ప్లాన్స్ వేసి చివరికి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చేతిలో పెట్టారు. బొమ్మరిల్లు భాస్కర్ చాలా గ్యాప్ తర్వాత అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాని తీసి ఓ మోస్తారు యావరేజ్ హిట్ ఇచ్చాడు.ఈ సినిమాతో భాస్కర్ కూడా కొంచెం ఫాంలోకి వచ్చాడు.ఇక మూడు సినిమాల తర్వాత అఖిల్‌కు ఓ హిట్ దక్కడంతో ఇక నాగార్జున ఇదే ఊపులో మంచి కమర్షియల్ హీరోగా నిలబెట్టాలని కూడా ఎన్నో రకాల గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ కథలను తన కొడుకు అఖిల్ కోసం ఫిల్టర్ చేసి ఒకే చెప్తున్నారు. ఇప్పటికే, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమాను చేస్తున్నాడు అక్కినేని అఖిల్.


ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. సురేందర్ రెడ్డి సినిమా అంటే మినిమం గ్యారెంటీ అని అందరికీ కూడా తెలిసిందే. ఇక ఈ సినిమాకు ఆయన కూడా ఓ నిర్మాత కాబట్టి అందుకే చాలా జాగ్రత్తగా ఈ ప్రాజెక్ట్‌ను చేస్తున్నాడు.కాబట్టి, ఏజెంట్ సినిమాతో అఖిల్‌కు హిట్ అనేది గ్యారెంటీ అని అక్కినేని అభిమానులు డిసైడయ్యారు.ఇక ఇప్పుడు ఇదే క్రమంలో మెగాస్టార్ చిరంజీవిని కూడా డైరెక్ట్ చేస్తున్న తమిళ స్టార్ డైరెక్టర్ మోహన్ రాజాతో అఖిల్ నెక్స్ట్ సినిమాను నాగ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో గాడ్ ఫాదర్ సినిమాను చేస్తున్న మోహన్ రాజా సినిమా రిలీజ్ కాకుండానే చాలా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. దీనికి కారణం ఈ మూవీలో సల్మాన్ ఖాన్, పూరి జగనాథ్ ఇంకా నయనతార లాంటి స్టార్‌ను నటింపచేయడమే. తమిళంలో స్టార్ డైరెక్టర్‌గా మంచి క్రేజ్ ఉన్న ఈ దర్శకుడితో కింగ్ నాగ్ అఖిల్ కోసం మంచి సాలీడ్ మాస్ స్టోరీని సెలెక్ట్ చేసినట్టు సమాచారం తెలుస్తుంది.త్వరలో ఈ సినిమాపై అఫీషీయల్ కన్‌ఫర్మేషన్ కూడా రానుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: