తండ్రి పర్సును దొంగిలించిన కీర్తి సురేష్.. ఎందుకో తెలుసా...?

murali krishna
మహానటి కీర్తి సురేష్ తాజాగా సర్కారు వారి పాట సినిమాలో కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో కీర్తి పాత్రకు అయితే మంచి క్రేజ్ దక్కింది.


ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా విజయాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారట కీర్తి సురేష్‌, మహేశ్‌ బాబు. ఇందులో భాగంగా శనివారం (మే 21) పలువురు యూట్యూబర్లతో చిట్‌చాట్‌ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేశ్‌ బాబు, కీర్తి సురేశ్‌, డైరెక్టర్‌ పరశురామ్‌ కూడా పాల్గొన్నారు. యూట్యూబర్లు అడిగిన ప్రశ్నలకు సరదాగా, ఆసక్తికర సమాధానాలు ఇచ్చారట. ఈ క్రమంలో షూటింగ్‌ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనలని వారు పంచుకున్నారు.ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో కీర్తి నన్ను తిట్టాలి. 3 టేకులు తీసుకున్నప్పటికీ కూడా కీర్తి చేయలేకపోయింది.


ఆ సమయంలో పరశురాం ఆమె దగ్గరకు వెళ్లి ‘మేడమ్‌.. మీరు సార్‌ను తిట్టాలి. గుర్తుపెట్టుకోండి ఆయన్ను మీరు తిట్టాలి.’ అని చాలాసార్లు చెప్పారట. కీర్తి ఇబ్బందిపడుతోందని నాకు బాగా అర్థమైంది. అప్పుడు నేను ‘పర్వాలేదు కీర్తి.. నన్ను నువ్వు తిట్టు’ అని చెప్పాను. దానికి ఆమె ‘సార్‌.. నేను మిమ్మల్ని తిట్టలేను. ఒకవేళ నేను మిమ్మల్ని తిడితే మీ ఫ్యాన్స్‌ నన్ను ఏదో ఒకటి అంటారు.’ అని చెప్పిందట ‘నా ఫ్యాన్స్‌ ఏం అనరమ్మ. నువ్వు తిట్టు.’ అని నచ్చజెప్పి ఆ సీన్ పూర్తయ్యేలా చేశాము . ఇక కీర్తి సురేష్‌ని ఓ నెటిజన్స్ ఆసక్తికర ప్రశ్నను వేశాడు.సర్కారు వారి పాట మూవీలో మీరు మహేష్ బాబు పర్స్ కొట్టేస్తారు, అలాగే నిజ జీవితంలో కూడా ఎవరిదైనా పర్స్ దొంగిలించారా? అని అడిగారట. కీర్తి బోల్డ్ ఆన్సర్ కి అందరూ కూడా ఫిదా అయ్యారు.



తన తండ్రి పర్స్ కొట్టేసినట్టు చెప్పుకొచ్చిందట కీర్తి సురేష్. ఆవిడ తల్లి మేనక మాజీ హీరోయిన్ కాగా తండ్రి సురేష్ దర్శకుడు. అలా చిత్ర పరిశ్రమలోనే కీర్తి పుట్టిపెరిగారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి పలు చిత్రాల్లో కూడా నటించారు. ఆ సమయంలో కీర్తి సురేష్‌కి పర్స్ దొంగతనం చేయాలని ఎందుకు అనిపించిందో మరి.దర్శకుడు పరుశురామ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సర్కారు వారి పాట తెరకెక్కించారట.. మైత్రి మూవీ మేకర్స్, జీఎంబి ఎంటరైన్మెంట్స్, 14 ప్లస్ రీల్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయని తెలుస్తుంది. సముద్ర ఖని, నదియా, సుబ్బరాజ్, వెన్నెల కిషోర్ ముఖ్యమైన రోల్స్ చేశారు. సర్కారు వారి చిత్రానికి థమన్ మంచి సంగీతం అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: