దుల్కర్ సల్మాన్ 'సీతారామం' మూవీ రిలీజ్ డేట్ లాక్ !

VAMSI
" data-original-embed="" >

మాలీవుడ్ సూపర్‌స్టార్ హీరోలలో ఒకరు అయిన దుల్ఖర్ సల్మాన్  ‘మహానటి’ సినిమా తర్వాత తెలుగులో నటిస్తున్న మరో చిత్రం ‘సీతారామం’.  అంతేకాదు ఈ సినిమాను స్వప్నా సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అయితే  ఈ సినిమాలో మృణాళ్ ఠాకూర్  కథానాయికగా చేస్తుండగా.. కన్నడ బ్యూటీ రష్మికా మందన్న ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా కథ విషయానికి వచ్చినట్లయితే రామ్ అనే ఓ మిలటరీ లెఫ్టినెంట్.. ఒక అందమైన అమ్మాయితో ప్రేమలో పడితే.. ఎలా ఉంటుంది అనే ఆలోచనలోంచి వచ్చిన కథతో  తెరకెక్కిస్తున్నాడు. ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా రూపొందుతోంది అని చెప్పుకొచ్చాడు దర్శకుడు.
ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్, అలాగే సింగిల్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఈ చిత్రం ట్రైలర్ త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈ సినిమాను ఆగస్ట్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ‘సీతారామం’ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ అంత కూడా  ప్రపంచం లోని ఎత్తైన పోస్టాఫీస్ లో జరిపారు. కాగా కథ ప్రకారం యుద్ధానికి సిద్ధమైన హీరో.. హీరోయిన్ కి రాసిన ప్రేమలేఖలు అన్ని కూడా ఈ పోస్టాఫీస్ నుంచే పోస్ట్ చేస్తుంటాడు. మరి ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలన్నీ కూడా ప్రేక్షకుల మనసును హత్తుకునేలా ఉంటాయని దర్శకుడు హను చెబుతున్నాడు.
అంతే కాదు ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా ‘సీతారామం’ పేరుతోనే విడుదల కాబోతోంది. అయితే  దర్శకుడు హను రాఘవపూడి నాలుగేళ్ళ క్రితం శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటించిన ‘పడిపడిలేచె మనసు’ అనే ప్రేమకథాచిత్రాన్ని తెరకెక్కించగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్టును అందుకోలేకపోయింది. అందుకే కాబోలు నాలుగేళ్ళ పాటు ఎంతో కష్టపడి మంచి కథరాసుకొని మరి ఇప్పుడు ‘సీతారామం’ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే దుల్ఖర్ సల్మాన్ పెర్ఫార్మెన్స్, రష్మికా అభినయం, మృణాల్ ఠాకూర్ గ్లామర్ అపీరెన్స్  ఈ సినిమాకి  మంచి హైలైట్స్ గా నిలుస్తాయని చెబుతున్నారు మూవీ మేకర్స్. మరి ఇప్పుడు ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకుంటుందో లేదో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: