'థాంక్యూ' సినిమా టీజర్ విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టొరీ మూవీ తో బాక్స్ ఆఫీస్  దగ్గర మంచి విజయం అందుకున్న నాగ చైతన్య,  ఆ తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన బంగార్రాజు మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మరొక విజయాన్ని అందుకున్నాడు. బంగార్రాజు మూవీ లో నాగార్జున హీరోగా నటించగా నాగ చైతన్య ఒక కీలకమైన పాత్రలో నటించాడు.

సంక్రాంతి కానుక గా థియేటర్ లలో విడుదల అయిన బంగార్రాజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా కలెక్షన్ లను కూడా బాగానే రాబట్టింది. ఇలా రెండు వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న నాగ చైతన్య ప్రస్తుతం థాంక్యూ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.  ఈ మూవీ కి విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించగా, ఈ మూవీ లో నాగ చైతన్య సరసన రాశి ఖన్నా కథానాయికగా నటిస్తోంది.  ఈ మూవీ కి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా థాంక్యూ  చిత్ర బృందం ఈ మూవీ కి సంబంధించిన క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది.  థాంక్యూ చిత్ర బృందం తాజాగా ఈ మూవీ కి సంబంధించిన టీజర్ విడుదల తేదీని ప్రకటించింది. థాంక్యూ మూవీ టీజర్ ను మే 25 వ తేదీన సాయంత్రం 5.04 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది.  ఇది ఇలా ఉంటే థాంక్యూ మూవీ ని 8 జులై 2022 వ తేదీన విడుదల చేయబోతున్నారు. థాంక్యూ మూవీ తో నాగ చైతన్య ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: