బాలయ్య సినిమా కోసం అదిరిపోయే స్టోరీలైన్ ను రేడీ చేసిన అనిల్ రావిపూడి..!

Pulgam Srinivas
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమాలో దునియా విజయ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నడు. అఖండ లాంటి భారీ బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత బాలకృష్ణ నటిస్తున్న సినిమా కావడం, క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.  ఈ మూవీ లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించ బోతున్నట్లు తెలుస్తోంది . ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. 

ఈ సినిమా తర్వాత బాలకృష్ణ టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకులలో ఒకరు ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు.  దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్ 3 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ మే 27 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల కాగానే దర్శకుడు అనిల్ రావిపూడి బాలకృష్ణ మూవీ పై పూర్తి కాన్సంట్రేషన్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే అనిల్ రావిపూడి , బాలకృష్ణ సినిమా కోసం అదిరిపోయే కథ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.  

తండ్రి కూతురు సెంటిమెంట్ తో బాలకృష్ణ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.  50 సంవత్సరాల వయస్సు ఉన్న పాత్రలో ఈ సినిమాలో బాలకృష్ణ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి కామెడీ ప్లస్ , యాక్షన్ ఎంటర్ టైనర్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ ను కలిపి తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: