కుర్ర హీరోలకు మేము తక్కువ కాదు అంటున్న చిరంజీవి... బాలకృష్ణ..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ సీనియర్ స్టార్ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి , బాలకృష్ణ లు కుర్ర హీరోలతో పోటీగా  సినిమాలలో నటిస్తూ వస్తున్నారు.  అందులో భాగంగా ప్రస్తుతం చిరంజీవి, బాలకృష్ణ నటిస్తున్న నటించబోయే సినిమాల గురించి తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఆచార్య సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆచార్య సినిమాతో తాజాగా ప్రేక్షకులను పలకరించిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. 
ఈ సినిమాతో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో కూడా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నాడు. అలాగే బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నారు.  ఈ సినిమాలతో పాటు టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమాలో నటించడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇలా చిరంజీవి కుర్ర హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా వరుస సినిమాల షూటింగ్ లలో పాల్గొంటూ,  మరొక సినిమాలను ఇప్పటికే లైన్ లో పెట్టుకొని రేడీ  గా ఉన్నాడు.


నందమూరి నట సింహం బాలకృష్ణ ఇప్పటికే అఖండ సినిమా విజయంతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.  ఇలా అఖండ సినిమా కథతో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.  ఈ సినిమా పూర్తి కాగానే బాలకృష్ణ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు. బాలకృష్ణ కూడా ఒక సినిమా  సెట్స్ పై ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టుకొని రెడీగా ఉన్నాడు. ఇలా ఈ ఇద్దరు టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోలు కుర్ర హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమాలను చేస్తూ ఫుల్ జోష్ చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: