ఓ తారకా.. పాపం బుచ్చిబాబు పరిస్థితి ఏంటి?

Purushottham Vinay
ఇక సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన తీసిన తొలి సినిమా ఉప్పెన ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమా మేకింగ్ దశలో వున్నప్పుడే చాలా ఆలస్యం అయింది. అనుకున్న దాని కంటే దాదాపు సంవత్సరం ఆలస్యంగా విడుదలైంది. ఇక ఆలస్యమైతే అయ్యింది కానీ.. సినిమా మాత్రం చాలా పెద్ద హిట్టయిందని సంబరపడితే.. ఆ తర్వాత రెండో సినిమా విషయంలో మాత్రం పాపం సుదీర్ఘ నిరీక్షణ తప్పేలా లేదు బుచ్చిబాబుకు.ఉప్పెన సినిమా తర్వాత అతడికి మంచి మంచి అవకాశాలే వచ్చాయి. ఐతే తన కెరీర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లే సినిమానే చేయాలని ఇంకా తనకు అప్పటికే మంచి అనుబంధం ఉన్న పెద్ద హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు కథ చెప్పాడు బుచ్చిబాబు. ఎన్టీఆర్ కి కూడా ఆ కథ నచ్చింది, సినిమా చేస్తానని కూడా ఆయన హామీ ఇచ్చాడు. బుచ్చిబాబు తొలి సినిమాను ప్రొడ్యూస్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మించడానికి ఓకే చెప్పింది. కానీ ఈ ప్రాజెక్టు ఎప్పుడన్నదే ఇంకా క్లారిటీ లేదు.ఇక బుచ్చిబాబేమో స్క్రిప్టు రెడీ చేసుకుని టెక్నీషియన్ల ఎంపికలో పడ్డాడు.


కానీ సినిమా వచ్చే రెండేళ్లలో మొదలయ్యే సూచనలే అసలు కనిపించడం లేదు. కొరటాల శివతో తారక్ సినిమా ఆలస్యం అవుతుండటం ఇంకా ప్రశాంత్ నీల్ సినిమా ఎప్పుడు పూర్తయ్యి రిలీజ్ అవుతుందో అనే క్లారిటీ లేకపోవడంతో బుచ్చిబాబు సినిమా ముందు మొదలవుతుందేమో అన్న ప్రచారం కూడా జరిగింది ఓ దశలో. ఇక అలా కాకపోయినా.. కొరటాల శివ సినిమా తర్వాత ఇదే ఉంటుందని కూడా అన్నారు. కానీ ఇప్పుడు అందుకు ఛాన్సే లేదని కూడా తేలిపోయింది.తన తర్వాతి రెండు చిత్రాలనూ కొరటాల ఇంకా ప్రశాంత్‌లతోనే చేయబోతున్నాడు తారక్. కాగా.. ఈ రెండు సినిమాల తర్వాత తారక్ ఇమేజే మారిపోవచ్చని, ఇక అప్పుడు బుచ్చిబాబుతో సినిమా చేస్తాడో లేదో అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయినా ఎన్టీఆర్ తో సినిమా చాలా ఆలస్యం అయ్యేలా ఉన్న నేపథ్యంలో బుచ్చిబాబు ఇంకా ఈ కథనే పట్టుకుని ఉండటం కరెక్ట్ కాదని, వేరే సినిమాల కోసం ప్రయత్నించడం మేలనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: