ఆకట్టుకుంటున్న ఆది సాయి కుమార్ 'బ్లాక్' ట్రైలర్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయినా ఆది సాయి కుమార్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  సాయి కుమార్ కుమారుడిగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆది సాయి కుమార్ ఆ తర్వాత తను నటించిన సినిమాల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమ కావాలి, సినిమా తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆది సాయి కుమార్, ఆ వెంటనే లవ్లీ సినిమాతో మంచి  విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు.

ప్రేమ కావాలి , లవ్లీ మూవీ లో విజయాలతో ఆది సాయి కుమార్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నాడు.  ప్రేమ కావాలి, లవ్లీ సినిమా లతో మంచి విజయాలను అందుకున్న ఆది సాయి కుమార్ ఆ తర్వాత మాత్రం ఆ రేంజ్ విజయాలను బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు అందుకోలేదు. వరుస పెట్టి సినిమా లలో నటిస్తున్నప్పటికీ ఆది సాయి కుమార్ కు మాత్రం ఆ సినిమాలు  నిరాశనే మిగిలిస్తూ వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సారి ఎలాగైనా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని తిరిగి ఫుల్ ఫామ్ లోకి రావాలని ఉద్దేశంతో ఆది సాయి కుమార్ 'బ్లాక్' అనే మూవీ లో హీరోగా నటించాడు.  

జి. బి కృష్ణా తెరకెక్కించిన ఈ మూవీ ని మహంకాళి దివాకర్ నిర్మించారు. బ్లాక్ సినిమా  మే 28 వ తేదీన విడుదల కాబోతుంది.  ఈ నేపథ్యంలో నటుడు సాయి కుమార్ ఈ మూవీ ట్రైలర్ ను తాజాగా విడుదల చేశాడు.  బ్లాక్ మూవీ త్రిల్లింగ్ గా ఉంటుంది అని పేర్కొన్నాడు.  ఈ సినిమాలో ఆది సాయి కుమార్ సరసన దర్శన బానిక్ హీరోయిన్ గా నటించింది. మరి ఆది సాయి కుమార్ 'బ్లాక్' మూవీ తో తిరిగి ఎలాంటి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: