ఎన్టీఆర్ లో వున్న మంచి లక్షణం ఏంటో తెలుసా...?

murali krishna
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం తెలిసిందే. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయని ఆయన అభిమానులు మరియు సన్నిహితులు చెబుతున్నారు.


వరుసగా ఆరు విజయాలతో డబుల్ హ్యాట్రిక్ ను సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే టాలీవుడ్ హీరోలలో ఒకరు..


ఫ్లాప్ వచ్చినా కానీ డైరెక్టర్లను నిందించకుండా కథ నచ్చితే ఆ డైరెక్టర్లకు మరో ఛాన్స్ ఇచ్చే హీరోగా కూడా జూనియర్ ఎన్టీఆర్ కు మంచి పేరుంది. టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ తను ఎంత పెద్ద హీరో అయినా స్క్రిప్ట్ ను లాక్ చేసిన తర్వాత స్క్రిప్ట్ లో వేలు పెట్టడానికి అస్సలు ఇష్టపడరట.. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అయిన జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు అడిగితే సీన్ పర్ఫెక్ట్ గా వచ్చేవరకు సీన్ విషయంలో అస్సలు రాజీ పడరట.


  సినిమాసినిమాకు లుక్ ను మార్చుకునే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రతి ప్రాజెక్ట్ కు తన బెస్ట్ ఇవ్వడానికి ఎంతగానో కృషి చేస్తారని ఇండస్ట్రీలో మంచి పేరుంది. తాజాగా ఒక మీడియా కన్సల్టింగ్ సంస్థ ఏప్రిల్ నెలలో సర్వేను నిర్వహించగా టాలీవుడ్ నుంచి తారక్ నంబర్ 1 స్థానంలో నిలిచారట.తారక్ తన ప్రతిభ వల్లే ఈ రికార్డ్ ను సాధించారని డైలాగ్ డెలివరీతో పాటు నటన, డ్యాన్స్, మరికొన్ని అద్భుమైన నైపుణ్యాలు ఉన్న స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కావడం విశేషం.


సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో తారక్ ఒకరు. అభిమానులకు ప్రాధాన్యత ఇచ్చే ఎన్టీఆర్ అభిమానులకు ఏదైనా కష్టం వచ్చిందని తెలిస్తే ఆదుకునే విషయంలో ముందువరసలో ఉంటారట. ఇతర హీరోల ఫ్యాన్స్ తో గొడవలు వద్దని అలాంటి వాటిని తాను ప్రోత్సహించనని చెప్పిన స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: