ఎన్టీఆర్ శత జయంతి రోజున సంచలన నిర్ణయం తీసుకోబోతున్న బాలకృష్ణ..!

Divya
స్వర్గీయ నందమూరి తారక రామారావు మే 28వ తేదీన జన్మించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాదితో ఆయన 100 వ యేడు మొదలవబోతోంది.  ఇక ఈ సందర్భంగా బాలయ్య నందమూరి అభిమానులకు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో నందమూరి బాలకృష్ణ ఏం రాశారు అనే విషయానికి గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..
బాలకృష్ణ ఆ లేఖలో మా నాన్నగారు సినీ రంగంలో అడుగుపెట్టి.. భారతీయ సినిమా తెలుగు సినిమాని తలెత్తి చూసేలా చేశారు.. ఇక ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఇక ఆయనవల్లే తెలుగు సంస్కృతి తలెత్తి నిలబడింది. అంతటి మహనీయుడైన నందమూరి తారక రాముడికి ఈనెల 28వ తేదీ తో నూరవ సంవత్సరం మొదలవుతుంది . ఇక ఆరోజు నుంచి 2023 మే 28 వరకు 365 రోజుల పాటు శత పురుషుడి శతజయంతి వేడుకలు నేల నలుచెరగులా  జరగబోతున్నాయి అని. ఆయన తెలియజేయడానికి గర్వపడుతున్నాను అంటూ ఆ లేఖలో వివరించాడు.  అంతే కాదు మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఎన్నో దేశాలలో జరుగనున్న ఈ వేడుకలకు మా నందమూరి కుటుంబం కచ్చితంగా హాజరు అవుతుంది..అందులో  ఆనందంగా పాలుపంచుకుంటుంది అంటూ తెలిపారు.
నెలకు ఒక్కరు నెలకో కార్యక్రమంలో మా కుటుంబ సభ్యులు భాగస్వాములు అవుతారు.. అందులో భాగంగా నేను 28వ తేదీ ఉదయం నిమ్మకూరుకు వెళ్లి అక్కడ వేడుకలలో పాల్గొనబోతున్నాను. అక్కడి నుంచి కళల కాణాచిగా ఖ్యాతి చెందిన తెనాలికి చేరుకుంటాము. ఇక అక్కడ జరిగే శతాబ్ది వేడుకల నా చేతుల మీదుగా ప్రారంభించి 365 రోజులు వారానికి ఐదు సినిమాలు.. వారానికి రెండు సదస్సులు..పురస్కారాల  ప్రధానోత్సవం ఇలా ఈ మహత్కార్యాన్ని రామకృష్ణ థియేటర్ లో ప్రారంభించి ఒంగోలు వెళ్లి మహానాడులో పాల్గొనబోతున్నామని తెలియజేస్తున్నాను అంటూ బాలయ్య బాబు ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. దీంతో అటు నందమూరి అభిమానులు , ఇటు ఎన్టీఆర్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: