మరోసారి పాన్ ఇండియా సినిమా పై సెటైర్లు వేసిన సిద్ధార్థ్.. కారణం..?

Divya
గత కొన్ని సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న  పదం పాన్ ఇండియా. ఇక రాజమౌళి ఎప్పుడైతే బాహుబలి సినిమా తో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కించాతో ఇక ఆరోజు నుంచి పుష్ప,  ఆర్ ఆర్ ఆర్,  కె జి ఎఫ్ అంటూ పాన్ ఇండియా సినిమాలు  కొనసాగుతున్నాయి. ఇకపోతే దీనిపై ఒక్కొక్కరు తమ వాదనలను వినిపిస్తున్నారు. ఇక చాలామంది అసలు ఈ పదం ఏంటో ఎందుకు వినియోగిస్తున్నారో అర్థం కావడం లేదు అని కొంతమంది అంటుంటే.. మన సినిమాకు అంతటి గౌరవం  అందడం చాలా గొప్ప విషయం అంటూ కొంతమంది అంటున్నారు. కానీ ఈ విషయంలో మాత్రం సిద్దార్థ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే వస్తున్నారు.
ఈ సారి కూడా పాన్ ఇండియా సినిమా అన్న విషయంపై ఆయన సెటైర్లు వేయడం చాలా సంచలనంగా మారింది. దక్షిణాది నటుడు గా  తన కెరీర్ ను  ప్రారంభించిన బాలీవుడ్లో కూడా ఎన్నో సినిమాలు చేసి భారతీయ నటుడనిపించుకున్నారు సిద్ధార్థ్. అలా సినిమాలను కూడా భారతీయ సినిమా అని అంటే సరిపోతుంది కదా అని చెబుతున్నారు. ఇక సినిమాల్లో కొన్నింటిని పాన్ ఇండియా అని పిలుస్తూ ఉంటే ఫన్నీగా ఉంది అని సిద్ధార్థ్ వ్యాఖ్యానించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా సిద్దార్థ్ నటిస్తున్న కొత్త వెబ్ సిరీస్ ఎస్కేప్ లైఫ్ ప్రమోషన్స్లో భాగంగా ఈయన ప్రచారంలో పాల్గొన్నారు. ఇక అందులో భాగంగానే ఇలా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
పాన్ ఇండియా అన్న పదం వినడానికే చాలా కామెడీగా ఉంది. 15 సంవత్సరాల నుండి వివిధ భాషల్లో సినిమాలు చేస్తూనే ఉన్నాను. కానీ తమిళ సినిమాల్లో చేస్తే తమిలియన్ గా, తెలుగు చిత్రాల్లో చేస్తే తెలుగింటి అబ్బాయిలా.. ఇలా ఏ భాషలో చేసిన ఆ పాత్రకు నేనే డబ్బింగ్  చెప్పుకుంటాను. అలాంటి చిత్రాలను ఇండియన్ ఫిలిం అంటే సరిపోతుంది కదా ఇలా పాన్ ఇండియా చిత్రాలు అంటే కాస్త అగౌరవంగా ఉంది అంటూ సిద్ధార్థ తన మనసులో మాటలను వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: