ఆర్ నారాయణ మూర్తి మార్గాన్ని ఆదర్శంగా తీసుకున్న అల్ల‌రి న‌రేష్ !

Seetha Sailaja
ఫిలిం ఇండస్ట్రీలో రాజేంద్రప్రసాద్ కామెడీ హీరో స్థానాన్ని అల్లరి నరేష్ చేరుకుంటాడు అని చాలామంది భావించారు. తన తండ్రి ఈ వి వి సత్యనారాయణ జీవించి ఉన్నంతకాలం ఈ అల్లరోడికి వరస హిట్స్ వచ్చేవి. ఇండస్ట్రీలో మినిమం గ్యారెంటీ హీరోగా ఒక వెలుగు వెలిగిన నరేష్ కెరియర్ ప్రస్తుతం ఏమాత్రం ఆశాజనకంగా లేదు.

‘మహర్షి’ మూవీలో ఒక కీలక పాత్రను పోషించిన తరువాత అతడికి చాల సినిమాలలో హీరో అన్న చిన్నాన్న పాత్రలకు సంబంధించి ఆఫర్లు బాగా వచ్చినప్పటికీ వాటిని నరేష్ తిరస్కరించాడు. కరోనా వేవ్ ల ముందు వచ్చిన ‘నాంది’ మూవీలో అల్లరి నరేష్ సీరియస్ నటనకు ప్రశంసలు వచ్చినప్పటికీ అతడికి అప్పుడు కూడ పెద్దగా అవకాశాలు రాలేదు. చాల గ్యాప్ తరువాత ఈ ‘సుడిగాడు’ నటిస్తున్న లేటెస్ట్ మూవీ షూటింగ్ మారేడుమిల్లి ప్రాంతాలలో జరుగుతోంది.

పూర్తి గిరిజన వాతావరణ నేపధ్యంలో అక్కడి గిరిజనులు ఎలా దోపిడీకి గురవుతున్నారో అన్న కథ ఈ మూవీ స్టోరీ పాయింట్ అంటున్నారు. సాధారణంగా ఇలాంటి కథలలో ఆర్ నారాయణ మూర్తి ఆతరువాత శ్రీహరి నటించారు. అయితే ఇప్పుడు మళ్ళీ అదే జోనర్ ను ఎంచుకుని అల్లరి నరేష్ ఒక సీరియస్ మూవీలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో కూడ అల్లరి నరేష్ కామెడీ పంచ్ డైలాగ్స్ ఉండవు అంటున్నారు. కేవలం అల్లరోడి సీరియస్ నటన మాత్రమే ఉంటుందట.

ఇప్పుడు నరేష్ చేస్తున్న ప్రమోగం విజయవంతం అయితే నారాయణ మూర్తి విప్లవ సినిమాలు మళ్ళీ నరేష్ తో తీసే ఆస్కారం ఉంది. వాస్తవానికి నేటితరం ప్రేక్షకులు పీడిత ప్రజల కష్టాలను ఓటీటీ సినిమాలలో చూడటానికి ఇష్టపడుతున్నారు కాని టిక్కెట్ కొనుక్కుని ధియేటర్లకు వచ్చి చూడటానికి పెద్దగా ఆశక్తి చూపించడం లేదు. ఈ కొత్త జోనర్ లో నరేష్ ఎంత వరకు సక్సస్ అవుతాడో చూడాలి. ఈమూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది..
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: