ఎన్టీఆర్ కథ పై కసరత్తు చేస్తున్న బుచ్చిబాబు..!

Pulgam Srinivas
ఉప్పెన సినిమాతో దర్శకుడిగా కెరియర్ ను ప్రారంభించిన బుచ్చిబాబు కి మొదటి సినిమా తోనే బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయం లభించింది. బుచ్చిబాబు మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం అందుకోవడంతో పాటు ఇటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుండి దర్శకుడిగా మంచి ప్రశంసలు అందుకున్నారు.  ఉప్పెన సినిమా తర్వాత బుచ్చిబాబు,  జూనియర్ ఎన్టీఆర్ తో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమాను తెరకెక్కించబోతున్నారు అంటూ అనేక వార్తలు బయటకు వచ్చాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ తదుపరి చేయబోయే కొరటాల శివ, ప్రశాంత్ నీల్ మూవీ లకు సంబంధించిన అప్డేట్ లను చిత్ర బృందాలు బయటికి వదిలాయి.   చాలా మంది బుచ్చి బాబు సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాబోతున్నట్లు భావించారు.  కాకపోతే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా బుచ్చిబాబు సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ బయటకు రాకపోవడంతో ఎన్టీఆర్, బుచ్చిబాబు కాంబినేషన్ లో సినిమా ఉండదేమో అని చాలా మంది అనుకున్నారు.  కాకపోతే ఎన్టీఆర్, బుచ్చిబాబు కాంబినేషన్ లో సినిమా ఉంటుంది అని తాజా టాక్.

ఇప్పటికే బుచ్చిబాబు , ఎన్టీఆర్ కు ఒక కథను వినిపించినట్లు ఆ కథకు సంబంధించిన ఫస్ట్ ఆప్ ఓకే అయినట్లు,  ఇంకా ఎన్టీఆర్ కు సెకండాఫ్ స్టోరీ వినిపించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు,  ఎన్టీఆర్ కు వినిపించే సెకండాఫ్ స్టోరీ కనుక బాగున్నట్లయితే ఎన్టీఆర్,  బుచ్చిబాబు కాంబినేషన్ లో సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది.  అందులో భాగంగా ప్రస్తుతం బుచ్చిబాబు,  ఎన్టీఆర్ సినిమాపై ప్రస్తుతం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే ఎన్టీఆర్ రెండు సినిమాలకు కమిట్ అవడంతో,  ఆ లోపు కూల్ గా బుచ్చిబాబు ఈ స్క్రిప్ట్ పనులను ముగించుకుని ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: