ఎన్టీఆర్ 30 లో ఇది ఒకసారి గమనించారా?
కొరటాల శివ, ప్రశాంత్ నీల్లతో చేయబోతున్నట్లు క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా అదరిపోయే రేంజ్లో ఉండటంతో ఈ సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని వారు అప్పుడే ఎదురుచూస్తున్నారు.తారక్, తన 30వ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి మెయిన్ ప్లాట్ ఏమిటో తెలియజేస్తూ ఓ వీడియో గ్లింప్స్‌ను వదిలారు చిత్ర యూనిట్. ఈ వీడియోలో తారక్ బేస్ వాయిస్‌తో చెప్పిన డైలాగ్‌తో ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చాయని చెప్పాలి.
పవర్ఫుల్ కథతో ఈ సినిమా రాబోతుందనే విషయం అయితే స్సష్టం అయ్యింది. అయితే ఈ వీడియో గ్లింప్స్‌లో దర్శకుడు కొరటాల శివతో పాటు మరికొందరి పేర్లు కూడా కనిపించాయి.ఈ సినిమాలో నటిస్తున్న, సినిమా కోసం పని చేస్తున్న అందరి పేర్లు కనిపించాయి. కానీ ఈ చిత్రంలో నటిస్తున్న హీరోయిన్ పేరు మాత్రం కనిపించలేదు.అలియా తప్పుకోవడం తో ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తారా అనే అంశం చాలా ఆసక్తికరంగా మారింది. మరి ఎన్టీఆర్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసే ఆ హీరోయిన్ ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే అంటున్నాయి చిత్ర వర్గాలు..మరి డైరెక్టర్ ఏ బ్యూటీని దించుతాడో చూడాలి..