ఓ ప్రశాంత్ నీలా ప్రతిసారి ఈ బొగ్గు ఫాంటసి ఏందయ్యా!

Purushottham Vinay
'కేజీఎఫ్' సినిమాతో ప్రేక్షకులందరినీ ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాలోని హీరో ఎలివేషన్లు ఇంకా మాస్ సన్నివేశాలు కొత్తేమీ కాదు కానీ..ఇక వాటిని ప్రశాంత్ తనదైన శైలిలో ప్రెజెంట్ చేసి అందరినీ బాగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కోల్ బ్యాక్ డ్రాప్ ఎంచుకోవడం సినిమాకు విజువల్‌గా చాలా కొత్త కలర్ ఇచ్చింది. ఐతే ఈ నేపథ్యాన్ని ప్రశాంత్ ఆ ఒక్క సినిమాకు మాత్రమే పరిమితం చేయడం లేదు.'కేజీఎఫ్' సినిమా తర్వాత అతను తెరకెక్కిస్తున్న 'సలార్' ఫస్ట్ లుక్, ఇతర ప్రోమోలు ఇంకా ఆన్ లొకేషన్ ఫొటోలు చూస్తే.. 'కేజీఎఫ్' స్టైల్ కొనసాగబోతోందని అర్థమైంది. వీటిలోనూ కోల్ బ్యాక్ డ్రాప్ ఉంటుందేమో అనిపించేలాగే ఆ పోస్టర్లు అనేవి తయారయ్యాయి. దీని మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జోక్స్ ఇంకా మీమ్స్ కూడా వస్తున్నాయి ముందు నుంచి. 'సలార్' సినిమాలో జగపతిబాబు లుక్ చూసినా.. ఆయన ముఖానికి బొగ్గు పూసుకున్నట్లు కనిపించాడు.అంతకుముందు ప్రభాస్ కూడా అంతే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ కొత్త సినిమా ప్రి లుక్ రిలీజ్ చేయగా.. అది కూడా అంత భిన్నంగా ఏమీ లేదు.


అతని ప్రతి పోస్టర్ కూడా ఒకేలా ఉంటోంది.ఇక ప్రశాంత్ నీల్ సినిమా అంటే ఎవ్వరైనా సరే.. ముఖానికి బొగ్గు రాసుకుని కెమెరా ముందు నిలబడ్డమే చేయాలని ఇక అంతకుమించి ఏమీ ఉండదని.. ఏ పోస్టర్ అయినా కానీ బొగ్గులో ముంచి తీసినట్లుగానే ఉంటుందని.. అసలు ఈ బొగ్గు ఫాంటసి ఏందయ్యా అంటూ ఇలాంటి కామెంట్లు వినిపిస్తున్నాయి బాగా వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో.ఐతే ఒక దశ దాకా ఇలాంటివి బాగానే ఉంటాయి కానీ.. ఆ తర్వాత తర్వాత మొనాటనీ అనిపిస్తాయి. ప్రశాంత్ నీల్ సినిమాల పోస్టర్లంటే ఇప్పటికే ఒక మూస అనే ఫీలింగ్ వచేస్తోంది. మొదట్లో కొంచెం కొత్తగా అనిపించేది ఏదైనా.. మళ్లీ మళ్లీ చూశాక ఇక ఇలాగే ఉంటుంది. కాబట్టి ఇకపై పోస్టర్లను మార్చాల్సిందే. దాంతో పాటు కథాంశాల విషయంలో కూడా పోలిక అనేది లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: