నైజాం ఏరియాలో 'ఎఫ్3' టికెట్ ధరలు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి అంటే..!

Pulgam Srinivas
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు కూడా భారీ బడ్జెట్ సినిమాలకు టిక్కెట్ ధరలను సినిమా విడుదల అయిన తర్వాత కొన్ని రోజుల పాటు పెంచుకునే వెసులుబాటును కల్పిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని టాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన భారీ బడ్జెట్ సినిమాలకు ఈ వెసులు బాటును కూడా ఉపయోగించుకొని  బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్లను కూడా అందుకున్నారు.  కాకపోతే కొంత మంది టికెట్ ధరలు అధికంగా ఉండటంతో థియేటర్లకు రాలేకపోతున్నారు అనే వార్త కూడా  ప్రచారంలో ఉంది.  

దానితో టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా మరియు డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు తాజాగా నిర్మించిన ఎఫ్ 3  సినిమా విషయంలో టికెట్ రేట్ లను ఏమాత్రం పెంచకుండా ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరలకే ఎఫ్ 3 సినిమాను  ప్రదర్శించనున్నట్లు తాజాగా ప్రకటించారు. అందులో భాగంగా నైజాం ఏరియాలో టికెట్ ధరల గురించి తెలుసుకుందాం.


హైదరాబాద్ లో  : ఏ ఎం బి మరియు ప్రసాద్ ఐమాక్స్ లలో ఎఫ్ 3 మూవీ కి 250 రూపాయము ప్లస్ జిఎస్టి అదనంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
మల్టీప్లెక్స్ థియేటర్ లలో 250 రూపాయలు ఉండనునట్లు తెలుస్తోంది.
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 150 ప్లస్ జిఎస్టి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
జిల్లా పరిధిలో : సింగిల్  స్క్రీన్ థియేటర్ లలో 150 ప్లస్ జిఎస్టి ఉండబోతున్నట్లు సమాచారం. ఇలా ఈ ధరలతో ఎఫ్ 3 సినిమా నైజాం ఏరియా థియేటర్ లలో ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తుంది.

ఎఫ్ 3 మూవీ మే 27వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోగా నటించగా తమన్నా, మెహరీన్ హీరోయిన్ లుగా నటించారు.  ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: