తండ్రి గురించి శివకార్తికేయన్ మాటల్లో.. ఏమన్నాడంటే..?

Divya
తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శివకార్తికేయన్. ఆయన నటించిన ప్రతి సినిమా కూడా తెలుగులో విడుదలై మంచి విజయాలను అందుకుంటూనే వున్నాయి. రెమో సినిమా ద్వారా తెలుగు లో తన సినిమాను విడుదల చేసిన మంచి టాక్ ను సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రం తర్వాత శివకార్తికేయన్ నుంచి వచ్చిన పలు చిత్రాలు తెలుగులో డబ్ చేసి విడుదల చేయగా అవి కూడా హిట్ అయ్యానని మంచి నటుడిగా చేయడమే కాకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పరచుకున్నాడు.

ఇక ఏకంగా డాక్టర్ మూవీతో మంచి విజయాన్ని అందుకున్నాడు. తాజాగా కాలేజ్ డేస్ అనే చిత్రం తో బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్ రాబట్టాడు కార్తికేయన్. ఈ చిత్రాన్ని శిబి చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రం మే 13 న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాని శివకార్తికేయన్ ప్రొడక్షన్ పై లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించినది. తాజాగా ఈ సినిమా విజయం సాధించడంతో ఆ చిత్ర యూనిట్ మీడియా ముందుకు వచ్చి ముచ్చటించడం జరిగింది. ఈ సందర్భంగా శివకార్తికేయన్ మాట్లాడుతూ కాలేజ్  డేస్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

కాలేజ్ డేస్ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది . దర్శకుడు కూడా మొదట స్క్రిప్ట్ వినిపించినప్పుడు ఈ కథ అందరికీ నచ్చుతుందని ఇద్దరు అనుకున్నామని మా నమ్మకం నిజమైంది అని తెలియజేశారు. ఇక డాక్టర్ వరుణ్ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు బాగా ఆదరించారు .కాలేజ్ డేస్ చిత్రాన్ని కూడా అందరూ అలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. తెలుగులో మాట్లాడాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ తెలుగు అర్థం అవుతుంది కానీ మాట్లాడలేని పరిస్థితి నాది అని తెలియజేశారు. అయితే తను నటించబోయే చిత్రానికి ఖచ్చితంగా తెలుగులో మాట్లాడుతానని తెలియజేశాడు శివకార్తికేయన్. ఇక ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక తన తండ్రి అంటే తనకు చాలా ఇష్టమని అందుకోసమే రోల్ మోడల్ గా మారారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: