యాంకర్ సుమ ఇంటిలో షూటింగ్ జరుపుకున్న సినిమాలివే?

VAMSI
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు సుమ కనకాల. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్ళు అయినా, యంగ్ యాంకర్లు ఎంత మంది వస్తున్నా సుమ స్థానాన్ని మాత్రం ఎవరూ ఆక్యుపై చేయలేకపోతున్నారు. ఇప్పటికీ అదే జోష్ తో ఇండస్ట్రీలో రాణిస్తోంది. తాజాగా ఈమె ప్రధాన పాత్రలో నటించిన 'జయమ్మ పంచాయితీ' రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇలా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా లోను ఎపుడు యాక్టీవ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫోటోలను , వీడియోలను పోస్ట్ చేస్తూ అభిమానులతో ముచ్చటిస్తుంటారు. అలా పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు కనుక బాగా గమనిస్తే... ఈ ఇల్లు ఆ లొకేషన్ ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది.
అయితే నిజంగా ఆ ఇల్లు ఎక్కడ చూసాము అని గుర్తు తెచ్చుకుంటే... కొన్ని సినిమాలు చూసినపుడు ఆ ఇల్లు కనిపిస్తుంది. ఎంతో మంది స్టార్ హీరోలు సుమ ఇంట్లో తమ సినిమాల షూటింగ్స్ జరుపుకున్నారు. ఇంతకీ ఆ హీరోలు ఎవరు, ఆ సినిమాలు ఏవి అన్నది చూద్దాం. మొదటిగా నాగ చైతన్య - సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 100% లవ్, ఈ చిత్రంలో నాగచైతన్య ఇల్లు సుమ కనకాలదే అట. కానీ ఈ విషయం ఎంత మందికి తెలుసన్నది చెప్పలేము. కావాలంటే ఒకసారి ఆ సినిమా చూసి ఆ ఇల్లు గుర్తు పెట్టుకుని యు ట్యూబ్ లో సుమ ఇల్లును చూడండి రెండు ఒకటే.
అదే విధంగా బాద్ షా చిత్రంలో కాజల్ అగర్వాల్ ఇల్లు కూడా సుమ రాజీవ్ కనకాల దే, బ్రూస్ లీ చిత్రంలో రామ్ చరణ్ ఇల్లుగా కూడా సుమ ఇంటినే తీసుకుని షూటింగ్ చేశారు. అలాగే మహేష్ బాబు నటించిన దూకుడు చిత్రంలో ఇల్లు చాలా ఫేమస్ కాగా... మహేష్ బాబు ప్రకాష్ రాజ్ ఉన్న ఇల్లు కూడా యాంకర్ సుమ దే. అలాగే సునీల్ నటించిన పూలరంగడు చిత్రం విలన్ ఇల్లు కూడా సుమ గారిదే. ఇలా పలువురు హీరోల చిత్రాల్లో సుమ కనకాల ఇల్లును వాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: