రౌద్రం ఉట్టిపడేలా ఎన్టీఆర్ 30వ సినిమా నుండి అదిరిపోయే వీడియో వచ్చేసింది..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్,  కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.  జూనియర్ ఎన్టీఆర్,  కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్క బోయే  తాజా చిత్రం జూనియర్ ఎన్టీఆర్ కు కెరియర్ పరంగా 30 వ  సినిమా. ఇది వరకే జూనియర్ ఎన్టీఆర్,  కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ సినిమా మంచి విజయం సాధించడంతో,  తాజా గా వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.  

ఇది ఇలా ఉంటే తాజా గా ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా నుండి చిత్ర బృందం ఒక వీడియో ను విడుదల చేసింది.  తాజా గా ఎన్టీఆర్ 30 వ సినిమా చిత్ర బృందం విడుదల చేసిన వీడియో లో ఎగిసి పడుతున్న అలల మధ్య... ఎన్టీఆర్ రెండు చేతులలో రెండు మారణాయుధాలతో  ఎంట్రీ ఇచ్చాడు. ఈ వీడియోలో ఎన్టీఆర్.... అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మించి దమ్ము ఉండకూడదు అని... అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చింది అని అనే డైలాగ్ ను పలికాడు.

ఈ వీడియో విడుదలైన నిమిషా ల్లోనే నెట్టింట ఫుల్ వైరల్ అవుతుంది. ఈ వీడియో ద్వారా చిత్ర బృందం ఈ మూవీ కి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించనున్నట్లు,  రత్నవేలు సినిమాటో గ్రాఫర్ గా పని చేయనున్నట్లు అఫీషియల్ గా చిత్ర బృందం తెలియజేసింది. నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ మూవీ ని నిర్మించబోతున్నారు.  త్వరలోనే ఈ మూవీ లోని ఇతర తారాగణం వివరాలు వెల్లడించనున్నారు. ఈ సినిమా షూటింగ్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: