నెట్ ఫ్లిక్స్ లో మారిన 'ఆర్ఆర్ఆర్' హిందీ స్ట్రీమింగ్ తేదీ..!

Pulgam Srinivas
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా ఎన్నో అంచనాల నడుమ మార్చి 25 వ తేదీన థియేటర్లో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాకు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించడం, ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున మార్చి 25 వ తేదీన విడుదల అయ్యింది.
 

విడుదల అయిన ప్రతి చోట నుంచే పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ మూవీ ఇప్పటివరకు దాదాపు 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టి అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర దక్కించుకుంది.  ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా 50 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని పూర్తి చేసుకుంది.  ఈ మూవీ ని మే 20 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి'  జీ 5 తెలుగు, తమిళ, కన్నడ,  మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు కొంత కాలం క్రితమే జీ 5 సంస్థ అధికారికంగా ప్రకటించింది.  

అయితే ఆ తర్వాత కొంత కాలానికి ప్రముఖ 'ఓ టి టి' సంస్థ నెట్ ఫ్లిక్స్ 'ఆర్ ఆర్ ఆర్' మూవీ కి సంబంధించిన హిందీ వర్షన్ ను జూన్ 2 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.  ఇది ఇలా ఉంటే తాజాగా నెట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' కూడా 'ఆర్ ఆర్ ఆర్' మూవీ హిందీ వర్షన్ ను మే 20 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది.  ఇలా నెట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' సంస్థ 'ఆర్ ఆర్ ఆర్' మూవీ ని ముందు చెప్పిన తేదీ కంటే ముందుగానే తమ  'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్  చేయడానికి రెడీ అయ్యింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: