9 కోట్లకు అమ్మితే కేరళ లో 'ఆర్ఆర్ఆర్' మూవీకి వచ్చిన కలెక్షన్లు ఇవి..!

Pulgam Srinivas
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ మార్చి 25 వ తేదీన చాలా గ్రాండ్ గా థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. మొదటి నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న కారణంగా 'ఆర్ ఆర్ ఆర్' సినిమాకు అదిరిపోయే రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ లు జరిగాయి. అందులో భాగంగా ఈ మూవీ కి మూవీ కి కేరళ ఏరియా లో కూడా అదిరిపోయే ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.  

'ఆర్ ఆర్ ఆర్' మూవీ కి కేరళ ఏరియా లో ప్రీ రిలీజ్ బిజినెస్ 9 కోట్ల మేర జరిగినట్లు సమాచారం. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మొదటి నుండి మంచి అంచనాలు నెలకొని ఉండడంతో 'ఆర్ ఆర్ ఆర్' మూవీ కి అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత కలెక్షన్లు కాస్త స్లో అయినప్పటికీ,  లాంగ్ రన్ లో ఈ మూవీ మూవీ కేరళ ఏరియాలో కలెక్షన్లను బాగానే రాబట్టింది.  

ఇప్పటివరకు 'ఆర్ ఆర్ ఆర్' మూవీ కేరళలో 24.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా, అందులో లో 'ఆర్ ఆర్ ఆర్' మూవీ షేర్ కలెక్షన్ల వాటా 11 కోట్ల మేరకు ఉంటుంది అని అంచనా,  దానితో కేరళ ఏరియా లో 9 కోట్ల రేటుకు అమ్ముడు పోయిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా 9.5 కోట్ల బ్రేక్ ఈవెన్ ఫార్ములాతో బాక్సాఫీస్ బరిలో దిగింది. దానితో 'ఆర్ ఆర్ ఆర్' సినిమాకు మొత్తంగా  1.5 కోట్ల మేరా లాభాలు వచ్చినట్లు సమాచారం. ఇలా 'ఆర్ ఆర్ ఆర్' మూవీ కేరళ ఏరియాలో క్లీన్ హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: