7వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అమాంతం పడిపోయిన సర్కారు వారి పాట కలెక్షన్లు..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున మే 12 వ తేదీన గ్రాండ్ గా థియేటర్ లలో విడుదల అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకు గీత గోవిందం మూవీ కి  దర్శకత్వం వహించిన పరుశురామ్ దర్శకత్వం వహించాడు.  సర్కారు వారి పాట  సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సనన్ హీరోయిన్ గా నటించింది.  సముద్రఖని ప్రతినాయకుడు పాత్రలో నటించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. మే 12 వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో విడుదల అయిన సర్కారు వారి పాట సినిమాకు విడుదలయిన మొదటి రోజు నుండి  బాక్సాఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ లభించింది.

ఆ నెగిటివ్ టాక్ ప్రభావం ఏ మాత్రం కనబడకుండా సినిమాకు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 36.01 కోట్ల కలెక్షన్లు దక్కాయి. రెండవ రోజు 11.04 కోట్లు , మూడవ రోజు 12.01 కోట్లు , నాలుగవ రోజు 12.06 కోట్లు, అయిదవ రోజు 3.64 కోట్లు, ఆరవ రోజు 2.32 కోట్ల  కలెక్షన్లను సాధించిన సర్కార్ వారి పాట సినిమా ఏడవ రోజు కలెక్షన్లు గమనిస్తే... నైజాం : 47 లక్షలు
 సీడెడ్ : 31 లక్షలు
యూ ఎ : 31 లక్షలు
ఈస్ట్ : 23 లక్షలు
వెస్ట్ : 16 లక్షలు
గుంటూర్ : 10 లక్షలు
కృష్ణ : 16 లక్షలు
నెల్లూర్ : 8 లక్షలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడవ రోజు సర్కారు వారి పాట సినిమా 1.82 కోట్ల షేర్ , 3.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

 
సర్కారు వారి పాట సినిమా ఏడు రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో 78.90 కోట్ల షేర్, 116 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
ఏడు రోజులకు గాను సర్కారు వారి పాట సినిమా ప్రపంచవ్యాప్తంగా 96.04 కోట్ల షేర్ , 151.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: