ఎన్టీఆర్ 30వ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చేది ఈరోజు ఆ సమయానికే..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన ఫుల్ ఫోకస్ ని కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా పైనే పెట్టాడు. కెరియర్ లో ఒక అపజయం కూడా లేకుండా సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ సక్సెస్ ఫుల్ దర్శకుడిగా దూసుకుపోతున్న కొరటాల శివ కు తాజాగా విడుదలైన ఆచార్య మూవీ తో మొట్ట మొదటి అపజయం బాక్స్ ఆఫీస్ దగ్గర లభించింది. మొదటి సారి బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొన్న కొరటాల శివ కు , ఎన్టీఆర్ కాస్త సమయం ఇచ్చి ,  కథ పైన పూర్తి పట్టు వచ్చాక సెట్స్ పైకి వెళ్దాం అని చెప్పినట్టుగా తాజా సమాచారం.  

అయితే ఎన్టీఆర్,  కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ కి సంబంధించిన అప్డేట్ మాత్రం ఎన్టీఆర్ పుట్టిన రోజు అయిన మే 20 వ తేదీన రానున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం మన అందరికి తెలిసిందే.  అయితే తాజాగా ఎన్టీఆర్ 30 వ మూవీ కి సంబంధించిన క్రేజీ అప్డేట్  ను చిత బృందం బయటకు వదిలింది. ఎన్టీఆర్ 30 వ సినిమా కు సంబంధించిన అప్డేట్ ను మే 19 వ తేదీన రాత్రి 7.02 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఒక పోస్టర్ ద్వారా తెలియజేసింది.  

మరి ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూవీ కి సంబంధించిన ఏ అప్డేట్ ను చిత్ర బృందం విడుదల చేస్తారో అని ఎన్టీఆర్ అభిమానులతో పాటు,  సామాన్య సినీ ప్రేమికులు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.  మరి ఎన్టీఆర్ 30 వ మూవీ కి సంబంధించిన ఏ అప్డేట్ ను విడుదల చేస్తారో... అనేది తెలియాలి అంటే ఈ రోజు రాత్రి వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: