పవర్ స్టార్ - సూపర్ స్టార్ : ఆ సినిమాలపై ఫ్యాన్స్ కోటి ఆశలు!

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 29వ సినిమా అయిన ఆర్ఆర్ఆర్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టోటల్ గా 1100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.ఇక ఈ నెల 20వ తేదీనుంచి ఓటీటీలో ఆర్ఆర్ఆర్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీలో కూడా సంచలన రికార్డులను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని అభిమానులు భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీ వెర్షన్ కోసం చరణ్, తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మరోవైపు పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు కూడా త్వరలో వేర్వేరుగా 29వ సినిమాలో నటించనున్నారు. మహేష్ బాబు 28వ సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కనుండగా అలాగే మహేష్ 29వ సినిమా రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కనుంది.ఇక మహేష్ భవిష్యత్తు సినిమాల ప్లానింగ్ విషయంలో దాదాపుగా ఎలాంటి మార్పు లేదని సమాచారం అందుతోంది. అయితే పవన్ 29వ సినిమా గురించి మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ 28వ సినిమాగా హరిహర వీరమల్లు తెరకెక్కుతోంది.పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్ సినిమాతో పాటు తెరి రీమేక్ కు ఇంకా వినోదాయ సిత్తం రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.


అయితే ఈ మూడు సినిమాలలో ఏ సినిమా మొదట మొదలవుతుందనే ప్రశ్నకు ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే నంబర్ సెంటిమెంట్ పవన్ కళ్యాణ్ కు కలిసొస్తే పవన్ కూడా 29వ సినిమాతో సంచలనాలు సృష్టిస్తారని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. భవదీయుడు భగత్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ 29వ సినిమాగా తెరకెక్కి విడుదలైతే చాలా బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని కావడంతో పవన్ ను చాలా అద్భుతంగా చూపిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నంబర్ సెంటిమెంట్ వల్ల పవన్ ఇంకా మహేష్ లకు ఈ సినిమాలతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సినిమాలు దక్కుతాయని ఇరు హీరోల ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ చాలా వేగంగా సినిమాలలో నటిస్తూ కెరీర్ ను చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: