మురుగదాస్ పై ఫోకస్ పెట్టిన అల్లు అర్జున్..!

Pulgam Srinivas
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే.  సుకుమార్ దర్శకత్వంలో రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కిన పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ విజయం బాక్సాఫీస్ దగ్గర సాధించడంతో ఒక్క సారిగా అల్లు అర్జున్ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్ లో పెరిగిపోయింది.  మరి కొద్ది రోజుల్లో  'పుష్ప పార్ట్ 2'  సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది.  పుష్ప పార్ట్ 2  సినిమా తర్వాత అల్లు అర్జున్ తర్వాత నటించబోయే సినిమాల కోసం ఇప్పటి నుండే పనులను ప్రారంభించినట్లు తెలుస్తుంది.

అందులో భాగంగా అల్లు అర్జున్ ప్రముఖ ప్రాధాన్యతను తమిళ డైరెక్టర్ లపై చూపుతున్నట్లు తెలుస్తోంది.  అందులో భాగంగా అల్లు అర్జున్ 'పుష్ప పార్ట్ 2'  సినిమా తర్వాత లైకా ప్రొడక్షన్ బ్యానర్ లో అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్లు అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి.  అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ హీరో గా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో  తెరకెక్కబోయే సినిమాలో అట్లీ స్థానంలో దర్శకుడిగా మురుగదాస్ తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.  దానికి ప్రధాన కారణం అల్లు అర్జున్ సినిమా కోసం అట్లీ అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు , అట్లీ డిమాండ్ చేశాం మొత్తంలో రెమ్యూనరేషన్ తెచ్చుకోలేక ఆ సినిమా నుంచి అట్లీ ని తప్పించినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

అధిక రెమ్యూనరేషన్ కారణంగా అల్లు అర్జున్ హీరోగా లైకా నిర్మాణ సంస్థ తెరకెక్కించబోయే సినిమా నుండి అట్లీ తప్పుకోవడంతో ఆ స్థానంలో మురుగదాస్ తీసుకోవాలనే ఆలోచనలో అల్లు అర్జున్ ఉన్నట్లు తెలుస్తోంది.  లైకా ప్రొడక్షన్స్ సంస్థ కూడా అట్లీ స్థానంలో మురుగదాస్ ను తీసుకోనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.  మరి ఇప్పటి వరకు ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: