విజయ్ దేవరకొండ తో రొమాంటిక్ మూవీలో నటించాలని ఉంది... మాళవిక మోహన్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ మాళవిక మోహన్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మాళవిక మోహన్  కోలీవుడ్ స్టార్ హీరో తళపతి విజయ్ ప్రధానపాత్రలో తెరకెక్కిన మాస్టర్ మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు లోనూ విడుదల అయ్యింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం తో  మాళవిక మోహన్ కు కూడా మంచి గుర్తింపు లభించింది.  

అలా మాస్టర్ సినిమా ద్వారా తమిళ , తెలుగు ప్రేక్షకుల మనస్సు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మారన్ మూవీ లో హీరోయిన్ గా నటించింది.  మారన్  మూవీ లో ధనుష్ హీరోగా నటించగా,  కార్తీక్  నరేన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.  ఏ సినిమా థియేటర్ లలో కాకుండా నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి'  లో విడుదల అయ్యింది. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇది ఇలా ఉంటే మూవీ ల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న మాళవిక మోహన్ సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టివ్ గా  ఉంటూ తన అభిమాను లతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది.

అందులో భాగంగా తాజాగా మాళవిక మోహన్ 'అస్క్ మాళవిక'  అనే సెషన్ ను సోషల్ మీడియాలో నిర్వహించింది.  ఇందులో భాగంగా ఓ నెటిజన్ మీరు ఇప్పటికే తమిళ స్టార్ హీరో అయిన విజయ్ సినిమాలో హీరోయిన్ గా నటించారు,  మీకు ఇంకా ఎ హీరో తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది అనే ప్రశ్న ను అడగగా... మాళవిక మోహన్...  రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తో రొమాంటిక్ మూవీ లో నటించాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: