జై భీమ్ టీమ్ కు రూ.5 కోట్లు ఫైన్.. కారణం..!!

Divya
హీరో సూర్య నటించిన జై భీమ్ చిత్రం గత సంవత్సరం అమెజాన్ ప్రైమ్ లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు వన్నియర్ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి అన్నట్లుగా ఆ సామాజిక వర్గం వాళ్ళు నిరసనకు వ్యక్తం చేశారు. నిర్మాతలలో ఒకరైన జ్యోతిక దర్శకుడు జ్ఞానవేల్ పై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు వారిని విమర్శించే విధంగా ఉన్నాయి అన్నట్లుగా హీరో దర్శక నిర్మాతలపై కేసు వేయడం జరిగింది.

ఈ కేసు స్థానిక  పోలీస్ స్టేషన్లో రుద్ర వన్నియర్ వ్యవస్థాపకుడు అయిన సంతోష్ ఫిర్యాదు చేయడం జరిగిందట. కానీ పోలీసులు ఎవరిపై కూడా కేసు నమోదు చేయలేదు దీంతో ఆయన సైదాపేట మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. కోర్టులో ఈ విషయంపై విచారణ జరుగుతోంది. హీరో సూర్య నిర్మాత జ్యోతిక డైరెక్టర్  జ్ఞానవేల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకు సమర్పించాలని అక్కడ ఉండే పోలీసులకు కోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
ఇక హీరో సూర్యా కు జోతిక తో పాటుగా డైరెక్టర్ జ్ఞానవేల్ పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు అయినట్లుగా సమాచారం అందుతోంది. ఇక అంతే కాకుండా వన్నియర్ సంఘం సూర్య జై భీమ్ చిత్ర బృందంపై రూ.5 కోట్ల రూపాయలకు పైగా పరువునష్టం దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో క్షమాపణలు కోరుతూ ఈ పరువు నష్టం నుంచి ఉపసంహరించుకుంటామని వన్నియర్ సంఘం వారు తెలియజేసినట్లు గా తెలుస్తోంది. మరి ఈ విషయంపై జై భీమ్ చిత్రబృందం ఏ విధంగా స్పందిస్తుందో తెలియాలి అంటే మరో కొద్ది రోజు లు ఆగాల్సిందే. హీరో సూర్య ఎప్పుడు సరికొత్త ధనంతోనే ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: