'ఢీ' షోలో యాంకర్ ప్రదీప్ డాన్స్ పెర్ఫార్మెన్స్.. ఇరగదీశాడుగా?

praveen
తెలుగు బుల్లితెర పై యాంకర్ ప్రదీప్  క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రేడియో జాకీగా తన ప్రస్థానం మొదలుపెట్టిన ప్రదీప్ ఆ తర్వాత తక్కువ సమయంలోనే తెలుగు తెరపై తిరుగులేని యాంకర్గా ఎదిగాడు. అందరిలా కాకుండా ఎంతో భిన్నంగా   యాంకరింగ్ చేస్తూ వల్గారిటీ కి  దూరంగా తన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ప్రస్తుతం ఇక బుల్లితెరపై నెంబర్ వన్ మేల్ యాంకర్ గా కొనసాగుతున్నాడు ప్రదీప్. ఇకపోతే ప్రస్తుతం ప్రదీప్ యాంకరింగ్ చేస్తున్నా డాన్స్ రియాలిటీ షో ప్రతివారం ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది.

 ఒకప్పుడు ఈ షోలో కేవలం డాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రమే ఉండేవి.. కానీ ఇప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ తో పాటు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ కూడా అందుతుంది అని చెప్పాలి. ఇకపోతే సాధారణంగా యాంకర్ గా మారిన తర్వాత డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం చాలా తక్కువగానే చూసి ఉంటారు ప్రేక్షకులు. కానీ ఇటీవల ఢీ షో లో మాత్రం ప్రదీప్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు అని చెప్పాలి. ఇటీవలే వచ్చే వారం ఎపిసోడ్ కు సంబంధించిన ఢీ షో ప్రోమో విడుదల సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమో లో భాగంగా కంటెస్టెంట్స్ తో కలిసి ఏకంగా ప్రదీప్ అదిరిపోయే డ్యాన్స్ చేశాడు.

 రెండు మూడు పాటలను మిక్స్ చేసి కంటెస్టెంట్స్ డాన్స్ చేశారు. ఇక ఈ డాన్స్ పర్ఫామెన్స్ లో భాగంగా  మొదటి నుంచి చివరి వరకు ప్రదీప్ డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తాడు. మధ్యలో తీన్మార్ డాన్స్ కూడా చేస్తాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ ప్రదీప్ పర్ఫామెన్స్ చూసిన ప్రేక్షకులు అందరూ కూడా మైమరచిపోతారు అని చెప్పాలి. ఎన్నాళ్ళకి ప్రదీప్ డాన్స్ చూస్తే అదృష్టం వచ్చింది అని అభిమానులు కూడా ఆనందపడి పోతున్నారు. ఇక ప్రదీప్ ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూడడానికి ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: