'ఢీ' షోలో గెస్ట్ గా వచ్చి.. డాన్స్ చింపేసిన అనిల్ రావిపూడి?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది దర్శకులు ఉన్నా కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతుంది మాత్రం అనిల్ రావిపూడి అని చెప్పాలి. పటాస్ అనే సినిమా ద్వారా ప్రస్థానం మొదలుపెట్టిన అనిల్ రావిపూడి ఇక ఆ తర్వాత సినిమాలతో తెలుగు ప్రేక్షకుల అందరినీ కూడా కడుపుబ్బ నవ్విస్తూ స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో సినిమాలు తీసే రేంజ్ సంపాదించాడు. అంతేకాదు ఇప్పుడు వరకు అనిల్ రావిపూడి తీసిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అయింది అని చెప్పాలి.

 అయితే గతంలో ఎఫ్2 అనే సినిమాతో నవ్వుల సునామి సృష్టించిన అనిల్ రావిపూడి ఇక ఇప్పుడు మరికొన్ని రోజుల్లో ఎఫ్ 3 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే  ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రస్తుతం బిజీగా ఉన్నాడు అనిల్ రావిపూడి. ముఖ్యంగా బుల్లితెర కార్యక్రమాల్లో ఎక్కడ చూసినా అనిల్ రావిపూడి దర్శనమిస్తున్నాడు అని చెప్పాలి. అయితే ఇటీవల రావిపూడి ఎఫ్ 3 సినిమాలో ఒక పాటలో డాన్స్ చేసాడు అంటూ ఒక వీడియో వైరల్ గా మారిపోయింది.

 కానీ ఇటీవలే మాత్రం మరోసారి అదిరి పోయే డాన్స్ చేసి అందర్నీ ఆశ్చర్య పరిచాడు అనిల్ రావిపూడి. ఇటీవల ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ కార్యక్రమం లో కి గెస్ట్ గా వచ్చాడు అనిల్ రావిపూడి. ఇందులో భాగం గా అదిరిపోయే స్టెప్పులు వేసి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ డాన్స్ చేస్తున్న సమయంలో స్టేజి మీదకి పరిగెత్తుకొచ్చిన అనిల్ రావిపూడి  మరోసారి డాన్స్ చేసి ఆకట్టుకున్నాడు. ఇక అనిల్ రావిపూడి డాన్స్ చూసిన తర్వాత ఈ దర్శకుడి లో ఇంత అద్భుతంగా  డాన్స్ చేసే టాలెంట్ కూడా దాగి ఉందా అని ఆశ్చర్య పోతున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: