షాకింగ్ సుకుమార్ కు గుర్తిపు తెచ్చిపెట్టిన రాజశేఖర్ !

Seetha Sailaja

సుకుమార్ ఎంతోమంది నటీనటులకు లైఫ్ ఇచ్చాడు. ముఖ్యంగా అల్లు అర్జున్ కు ‘ఆర్య’ మూవీతో సుకుమార్ గుర్తింపు తీసుకు వచ్చాడు. రామ్ చరణ్ ను ‘రంగస్థలం’ మూవీలో చెవిటి వాడిగా చూపించి ఒక నటుడు సుకుమార్ చేతిలో పడితే ఏవిధంగా రాణిస్తాడో అందరికీ తెలిసివచ్చేలా చేసాడు. అలాంటి సుకుమార్ కు సినిమాల పట్ల ఆశక్తి కల్గించింది రాజశేఖర్ సినిమాలు అంటే ఎవరూ నమ్మలేని విషయం అయితే ఇది వాస్తవం.
 
 ఈవిషయాన్ని స్వయంగా సుకుమార్ ‘శేఖర్’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చెప్పి ఆ ఫంక్షన్ కు వచ్చిన చాలామందికి షాక్ ఇచ్చాడు. సుకుమార్ కాలేజీలో చదువుకునే రోజుల్లో రాజశేఖర్ సినిమాలు తెగ చూసేవాడట. అంతేకాదు రాజశేఖర్ నడక అతడి బాడీ లాంగ్వేజ్ ని అనుసరిస్తూ అతడు చదువుకునే కాలేజీ క్యాంపస్ లో తిరిగే వాడట.
 
 
దీనితో ఆరోజులలో అతడిని జూనియర్ రాజశేఖర్ అని పిలుస్తూ ఉండేవారట. ఈ విషయాలను ఇప్పుడు గుర్తుకు చేసుకుంటూ ఒకవిధంగా తనకు సినిమా ఇండస్ట్రీ అంటే ఆశక్తి కల్గడానికి పరోక్షంగా రాజశేఖర్ కారకుడు అంటూ అతడిని ఆకాశంలోకి ఎత్తేస్తూ ప్రశంసలు కురిపించాడు. వాస్తవానికి ‘శేఖర్’ మూవీకి ఎంతవరకు ప్రమోట్ చేయగలరో ఆస్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. ఈ మూవీకి ధియేటర్లు కూడ బాగానే దొరకాయి.
 
 ‘సర్కారు వారి పాట’ హవా చల్లబదతంతో ఈవారం ఖచ్చితంగా సినిమా చూడాలి అని ఆలోచించే వారికి ‘శేఖర్’ మూవీ గుర్తుకు వస్తుంది అయితే వాచ్చే వారమే అనీల్ రావిపూడి ‘ఎఫ్ 3’ రాబోతోంది. దీనితో కేవలం వారం రోజులలో ఎంతవరకు ఈసినిమా నిలబడగలుగుతుంది అన్న సందేహాలు ఉన్నాయి. మీడియా వర్గాలకు రాజశేఖర్ అంటే కొంతవరకు అతని సినిమాల పై ఆశక్తి ఉంది. అయితే సినిమా ఖచ్చితంగా బాగుండి తీరాలి. అలాంటి పరిస్థితి ‘శేఖర్’ కు ఏర్పడితే ‘ఎఫ్ 3’ విడుదల అయ్యేవరకు ఈ మూవీ హవా కొనసాగే ఆస్కారం ఉంది..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: