అంగరంగవైభవంగా ఆది-నిక్కి ల వివాహం..వీడియో..

Satvika
ఈ మధ్య సంచలనం రేపిన హీరో ఆది ప్రేమ, పెళ్ళి నిన్న రాత్రి అట్టహాసంగా జరిగింది. ఇటు తెలుగు లో ఎన్నో చిత్రాల్లో మెప్పించాడు. అటు తమిళ సినిమాల లో ఎన్నో ప్రత్యేక పాత్రల్లో నటించి మెప్పించాడు. స్టార్ హీరోగా, విలన్ గా మార్కెట్ మంచి పేరును అందుకున్నాడు..అయితే తాజాగా ఆయన ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకొని ఓ ఇంటి వాడు అయ్యాడు.ఈ ఏడాది మార్చిలో ఆది-నిక్కీ గల్రానికి నిశ్చితార్థం అయిన విషయం తెలిసిందే..


బుధవారం చెన్నైలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్ ఈవెంట్‌లో తన ప్రియురాలు నిక్కీ గల్రాని తో కలిసి ఏడడుగులు వేశాడు. హిందూ సంప్రదాయం ప్రకారం కుటుంబసభ్యులు, సన్నిహితుల, సినీ పరిశ్రమకు చెందిన స్నేహితుల సమక్షంలో వివాహా వేడుక ఘనంగా జరిగింది. తెలుగు లో నటించిన స్టార్ హీరోలు ఈ పెళ్ళికి హాజరై సందడిగా నిలిచారు. ముఖ్యంగా ఈ పెళ్ళి వేడుకలో న్యాచురల్ స్టార్ నాని, సందీప్ కిషన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. మెహిందీ సెర్మనీలో ఆలుమా డోలుమా పాటకు నాని, సందీప్ కిషన్‌తోపాటు ఆది-నిక్కీ డ్యాన్స్ చేసిన వీడియో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.

 
ఆ తర్వాత సాయంత్రం ఆర్య, సయేషా సెహగల్‌తో కలిసి ఆది-నిక్కీ పార్టీ చేసుకున్నారు. ఆఫ్ వైట్ కుర్తా సెట్‌లో ఆది పినిశెట్టి, పార్టీ నైట్ కోసం ప్రింటెడ్ కఫ్తాన్‌లో నిక్కీ తళుక్కున మెరిశారు.2015లో వచ్చిన మలుపు సినిమాలో ఆది పినిశెట్టి-నిక్కీ కలిసి నటించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య లవ్ జర్నీ మొదలైంది. ఆది-నిక్కీ వెడ్డింగ్ స్టిల్స్, వీడియోలు ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. నిక్కీ గల్రానీ ప్రస్తుతం రెండు మలయాళ సినిమాల్లో నటిస్తోంది. ఆది పినిశెట్టి ప్రస్తుతం రామ్ హీరోగా తెరకెక్కుతున్న ది వారియర్‌లో విలన్‌గా నటిస్తున్నాడు. దీంతోపాటు మరో బైలింగ్యువల్ ప్రాజెక్టు కూడా చేస్తున్నాడు..మొత్తానికి వీరిద్దరు ఒక్కటైయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: