తెలంగాణ సీఎం ను కలిసిన తమిళ స్టార్ హీరో..

Satvika
తమిళ స్టార్ దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఆయనకున్న ఫాలొయింగ్ గురించి అందరికి తెలిసిందే.. విజయ్ ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్నీ కూడా తెలుగు లో డబ్ చేశారు. ఇక్కడ మంచి హిట్ ను అందుకోవడం తో పాటు బాక్సాఫిస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించాయి.దాంతో హీరో విజయ్ కు ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఏర్పడింది.. తమిళ థంబీల తో పాటు తెలుగు తమ్ముళ్ళు కూడా విజయ్ సినిమాల కోసం ఎదురు చూస్తుండటం విశేషం..


ఇటీవల విజయ్ నటించిన బీస్ట్ సినిమా విడుదల అయ్యింది.ఆ సినిమా పెద్దగా జనాలను ఆకట్టుకోలేక పోయింది. అయిన విజయ్ వెనకడుగు వెయ్యలేదు.. ఇప్పుడు మరో రెండు, మూడు ప్రాజెక్టులలో నటిస్తున్నారు.. షూటింగ్ పని మీద హైదరాబాద్‌ వచ్చిన విజయ్ తెలంగాణ మంత్రి సీఎం కెసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిశారు.హీరో విజయ్‌ తో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఉన్నారు. వీరిని ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్, సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా హీరో విజయ్‌ను సీఎం కేసీఆర్ శాలువాతో సన్మానించారు. విజయ్‌ను కేసీఆర్ అప్యాయంగా పలకరించి సినిమా విశేషాలను అడిగి తెలుసుకున్నారు.


ప్రస్తుతం హీరో విజయ్ ద్విభాషా చిత్రం చేస్తున్నారు. ఈ మూవీకి దిల్ రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా దర్శకుడు వంశీపైడిపల్లి తెరకెక్కిస్తున్నారు. సినిమాను తమిళంతో పాటు తెలుగులో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం హీరో విజయ్ హైదరాబాద్ వచ్చారు.అయితే, హీరో విజయ్ సినిమాలు తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలోనూ విడుదలవుతున్నాయి.
'అదిరింది', 'విజిల్', 'తుపాకీ', 'మాస్టర్', 'బీస్ట్' సినిమాలు తెలుగులోనూ విడుదలయ్యాయి. మంచి ఆదరణ పొందాయి. హీరో విజయ్‌కు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే..ఆ సినిమా అన్నా విజయ్ ఖాతాలో హిట్ టాక్ ను అందిస్తుందెమొ చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: