పాపం భీమ్లా నాయక్ డైరెక్టర్ ఏమైపోయాడు?

Purushottham Vinay
మలయాళ బ్లాక్‌బస్టర్ సినిమా అయ్యప్పనుం కోషీయుం తెలుగు రీమేక్ భీమ్లా నాయక్‌ సినిమాకు దర్శకుడిగా సాగర్ చంద్ర పేరైతే పడింది కానీ.. పాపం ముందు నుంచి కూడా ఆ సినిమాకు సంబంధించి ఏ క్రెడిట్ అతడికి దక్కినట్లు కనిపించలేదు.ఇక ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు అందించింది త్రివిక్రమ్ శ్రీనివాస్ కావడం ఇంకా అలాగే మేకింగ్ టైంలోనూ సెట్లోనూ ఉండి అన్నీ తానై నడిపించడం.. ఇంకా సినిమా కోసం ఒక పాట రాయడం.. అలాగే మ్యూజిక్ సిట్టింగ్స్‌లో కూడా ఆయన కీలక పాత్ర పోషించడంతో ఇది త్రివిక్రమ్ సినిమా అన్న అభిప్రాయమే జనాల్లో బాగా కలిగింది.విడుదల ముంగిట ప్రి రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ వెనుక ఉండి సాగర్ హైలైట్ కావాలని చూసినా కానీ దాని వల్ల పెద్దగా ఫలితం అనేది లేకపోయింది. ఇక విడుదల తర్వాత సంగతి సరేసరి. చాలా సన్నివేశాల్లో ఇంకా అలాగే డైలాగుల్లో కూడా త్రివిక్రమ్ ముద్ర కనిపించడంతో సాగర్‌ను దర్శకుడిగా గుర్తించి ఈ సినిమా సక్సెస్ క్రెడిట్‌ను అతడికి కట్టబెట్టిన వాళ్లు తక్కువనే చెప్పాలి.ఇక మొత్తంగా చూస్తే.. భీమ్లానాయక్ సినిమా వల్ల సాగర్‌కు పారితోషకం అంది ఉండొచ్చు కానీ, వేరే ప్రయోజనం మాత్రం ఏమీ లేనట్లే అని చెప్పాలి.


ఎందుకంటే సినిమా విడుదల అయ్యి మూడు నెలలు కావస్తున్నా అతడి నుంచి కొత్త అనౌన్స్‌మెంట్లేమీ అసలు లేవు. ఒక హిట్ ఇచ్చాడు పైగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో అన్నపుడు వెంటనే అవకాశాలు వెల్లువెత్తాలి. కానీ సాగర్ కొత్త సినిమా కబుర్లేమీ అసలు వినిపించడం లేదు.ఇక అంత పెద్ద సినిమాను డైరెక్ట్ చేసి హిట్టు కొట్టాక మామూలుగా అయితే కొత్త సినిమాల అనౌన్స్‌మెంట్లు అనేవి ఉండాలి. కానీ పాపం అలాంటిదేమీ లేదు. అసలు సోషల్ మీడియాలో కూడా సందడే లేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అతణ్ని పెద్దగా ఓన్ చేసుకున్నట్లుగా కనిపించలేదు. నిజానికి భీమ్లా నాయక్ సినిమా కంటే ముందు తీసిన అయ్యారే ఇంకా అప్పట్లో ఒకడుండేవాడు చిత్రాలతో సాగర్‌కు మంచి పేరొచ్చింది. కానీ అవి కమర్షియల్‌గా పెద్ద హిట్ కాకపోవడంతో కెరీర్ ముందుకు సాగలేదు. అలాంటి టైంలో భీమ్లా నాయక్ సినిమా లాంటి పెద్ద సినిమాను బాగానే డీల్ చేసినా కానీ దాని సక్సెస్ క్రెడిట్ మాత్రం ఇంచు కూడా సాగర్‌కు దక్కక అతడి కెరీర్‌కు మరోసారి బ్రేక్ పడ్డట్లే కనిపిస్తోంది.పాపం భీమ్లా నాయక్ డైరెక్టర్ ఏమైపోయాడు?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: