వామ్మో : ప్రభాస్ నిజంగా ... అంత పెద్ద సాహసం చేస్తున్నారా .... ??

GVK Writings
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల రాధేశ్యామ్ మూవీ ద్వారా ప్రేక్షకాభిమానులు ముందుకు వచ్చారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించగా యువి క్రియేషన్స్ సంస్థ దీనిని నిర్మించింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయి సక్సెస్ మాత్రం అందుకోలేదు. ఇక ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో ఆదిపురుష్ అలానే శాండల్ వుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్, వీటితో పాటు యువ దర్శకుడు నాగ అశ్విన్ తో ప్రాజెక్ట్ కె సినిమాలు చేస్తున్నారు ప్రభాస్. 

ఈ మూడు సినిమాలు కూడా ఎంతో భారీ స్థాయిలో ఒకదానిని మించేలా మరొకటి అత్యధిక వ్యయంతో పాటు పాన్ ఇండియా మూవీస్ గా రూపొందుతున్నాయి. ఈ మూడింటి పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అయితే విషయం ఏమిటంటే, త్వరలో యువ దర్శకుడు మారుతీతో కూడా రెబల్ స్టార్ ఒక సినిమా చేయనున్నారు అని, ఆ సినిమాకి టైటిల్ రాజా డీలక్స్ అని కొద్దిరోజులుగా మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అయిన విషయం తెలిసిందే. మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒకింత థ్రిల్లింగ్ జానర్ లో ఈ మూవీ సాగనుందట.

ముఖ్యంగా తన కెరీర్ లో ఇప్పటివరకు పోషించని ఒక డిఫరెంట్ రోల్ లో ప్రభాస్ కనిపించనున్నారని, ఆ క్యారెక్టర్ లో పాజిటివ్ తో పాటు నెగటివ్ షేడ్స్ ఉంటాయని, ఒకరకంగా ప్రభాస్ ఫస్ట్ టైం ఇటువంటి రోల్ తో సాహసం చేస్తున్నారని లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. స్టోరీ డిస్కషన్స్ ఆల్మోస్ట్ పూర్తి అయిన ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో రానున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: