బీస్ట్ సినిమా ఫైనల్ కలెక్షన్స్ ఇవే... ఎన్ని కోట్ల నష్టం వచ్చింది అంటే..!

Pulgam Srinivas
కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన తళపతి విజయ్ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తలపతి విజయ్ కోలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో హిట్,  సూపర్ హిట్,  బ్లాక్ బస్టర్ సినిమా లతో తమిళ నాట స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు.  ఇలా కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న తళపతి విజయ్ తాజాగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'బీస్ట్' సినిమాలో హీరోగా నటించిన విషయం  మన అందరికీ తెలిసిందే.  ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.  

ఈ సినిమా విడుదలకు ముందు నుండే ఈ సినిమా నుండి విడుదల అయిన పాటలు , ప్రచార చిత్రాలు , టీజర్ , ట్రైలర్ లు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 13 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదలైన 'బీస్ట్'  సినిమా విడుదలైన మొదటి రోజు నుండే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.  

ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుండే ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ వద్ద నెగిటివ్ టాక్ లభించడం,  ఈ సినిమా విడుదల అయిన తర్వాత రోజే 'కే జి ఎఫ్ చాప్టర్ 2'  సినిమా విడుదల అవ్వడం , 'కే జి ఎఫ్ చాప్టర్ 2' సినిమాకు బ్లాక్బస్టర్ టాక్ రావడంతో ఆ ప్రభావం 'బీస్ట్' మూవీ కలెక్షన్లపై  పడింది.  ఇక 'బీస్ట్' మూవీ ఫైనల్ కలెక్షన్ లను చూసుకున్నట్లయితే...  ఈ సినిమా ఇప్పటి వరకు 119 కోట్ల షేర్ ,  235 కోట్ల గ్రాస్ కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర సాధించింది. మొత్తంగా చూసుకుంటే 'బీస్ట్' మూవీ ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 7.5 కోట్ల నష్టాలను మిగిలిచినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: