ఆ యంగ్ హీరోను ముగ్గురు హీరోయిన్ లు రిజెక్ట్ చేశారట ?

VAMSI
సినీ పరిశ్రమ అనగానే గ్లామర్ ప్రపంచం గనుక కాస్టింగ్ కౌచ్ సహా రకరకాల వ్యవహారాలు నడుస్తాయన్న వాదన మాత్రం ఈనాటిది కాదు. అయితే ఇదంతా అబద్దమే అలాంటివేమి ఉండవు అని అనేవాళ్ళు లేక పోలేదు . అలాగే ముందు అసలు మనం సరిగ్గా వుంటే, ఎలాంటి చెత్తా కూడా మన దరికి చేరదు. అనే హీరోయిన్లూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే ఒక యువ హీరో సినిమాకి హీరోయిన్ల కొరత వచ్చి పడిందట. కాగా ముగ్గురు హీరోయిన్లతో డీల్ కోసం ఆ సినిమా నిర్మాతలు ప్రయత్నించగా, ఆ హీరోయిన్ లు 'నో' చెప్పేశారట. అంతేకాదు అందులో ఓ హీరోయిన్, ఆల్రెడీ ఆ హీరోతో గతంలో వర్క్ చేసిందట.
అయితే ఇప్పుడు ఇంతకీ, అసలు సమస్య ఎక్కడ వుంది ? అంటే, మన హిరో 'రసిక్ రాజ్' వల్లనే ఈ సమస్య అంతా అంటున్నారు. కాగా ఓ నటి ఇటీవల పెద్ద హిట్ కొట్టి, ఆ తర్వాత ఇంకో సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది. ఆమెని కూడా నిర్మాతలు అప్రోచ్ అయినప్పుడు మొదటగా ఓకే చెప్పిందట. అయితే మన హీరోగారి 'ఇన్‌డీసెంట్' ప్రపోజల్ దెబ్బకి,  ఆ హీరోయిన్ మళ్లీ 'నో' చెప్పడం జరిగిందట. ఇక చేసేది ఏమి లేక, గతంలో పనిచేసిన హీరోయిన్ వద్దకు నిర్మాతలు వెళ్లగా, అప్పటికీ ఇప్పటికీ ఆ హీరోలో చాలానే మార్పులు వచ్చాయని, అందుకు తాను ఆ హీరోతో పని చేయనని ఆ హీరోయిన్ కూడా తేల్చి చెప్పేసిందట.
ఇలా ఆ ముగ్గురు హీరోయిన్లు, మన హీరో సినిమాకి దూరంగా జరిగిపోయారని తెలుస్తోంది. కాగా ఇంతకీ ఎవరా హీరో ? అనే విషయానికి వస్తే, అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంచగా ఆ సదరు హీరో మాత్రం ఇటీవలే ఓ కొత్త కార్యాలయాన్ని కూడా ప్రారంభించాడం జరిగింది. మరి ఆ కార్యక్రమం ఎందుకనగా ఇలాంటి ఇన్‌డీసెంట్ ఎఫైర్స్ కోసమే అనే వాదన లేకపోలేదు.!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: