RRR : అక్కడ రీ రిలీజ్.. మళ్ళీ వసూళ్ల మోత మోగడం ఖాయం!

Purushottham Vinay
పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ యస్ యస్ రాజమౌళి తెరకెక్కించిన ప్రెస్టీజియ్ మల్టీస్టారర్ సినిమా 'ఆర్ఆర్ఆర్' ఇప్పటికే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ కూడా తెలిసిందే.ఇక అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ చరణ్ ఇంకా అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు కలిసి నటించడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా రిలీజ్ రోజునే అందరి అంచనాలను బ్రేక్ చేస్తూ బ్రహ్మాండమైన రెస్పాన్స్‌ను కూడా దక్కించుకుంది.ఈ సినిమా విడుదల అయ్యి ఈ మధ్యనే యాభై రోజులు పూర్తి చేసుకోగా మే 20 వ తేదీ నుండి ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కానుంది. సినిమా యాభై రోజులు పూర్తిచేసుకున్నా కూడా త్వరలో ఓటీటీలో రాబోతున్న సినిమాకి ప్రేక్షకుల నుండి ఆదరణకు మాత్రం డోకా లేదు.


ఇండియాతో పాటు యూఎస్ లో కూడా ఆర్ఆర్ఆర్ సినిమా భారీ వసూళ్లను సాధించుకోగా.. ఇప్పుడు యూఎస్ లో ఈ సినిమా రీ రిలీజ్ కోసం ప్లాన్లు జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే.. ఈసారి ఒరిజినల్ కట్ వెర్షన్ ని విడుదల చేయనున్నారు.జూన్ 1 వ తేదీన యూఎస్ లో ఒరిజినల్ కట్ వెర్షన్ రిలీజ్ కి ప్లాన్ చేశారు. దీనికి ఇప్పటికే ఊహించని స్థాయిలో బుకింగ్స్ కూడా స్టార్ట్ కాగా.. ఈ స్పెషల్ స్క్రీనింగ్ కి కూడా భారీ వసూళ్లు వచ్చే ఛాన్స్ కూడా ఉందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్ రెస్పాన్స్ ను బట్టి మరికొన్ని షోస్ వేయాలా వద్దా అనే అంశాన్ని కూడా పరిశీలించనున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఈ స్పెషల్ స్క్రీనింగ్ కి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో హడావుడి కూడా మొదలు కాగా ఇక ఏ స్థాయి ఆదరణ దక్కించుకుంటుందో అనేది చూడాలి.ఇక మళ్ళీ ఆర్.ఆర్.ఆర్ వసూళ్ల మోత మోగించడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: