మరో తమిళ స్టార్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా!

Purushottham Vinay
ఇక rrr సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్థాయి ఒక్కసారిగా పెరిగి పోయిన విషయం తెలిసిందే. ఇక ఈ హీరోతో సినిమా చేయడానికి ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వున్న టాప్ దర్శకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఓ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే సగానికిపైగా కంప్లీట్ అయ్యింది.అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, గౌతమ్ తిన్ననూరితో కూడా ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కూడా డిఫరెంట్ ఎమోషనల్ డ్రామా గా ఉంటుంది అని సమాచారం తెలుస్తోంది. మొదట స్పోర్ట్స్ డ్రామా అని అందరు కూడా అనుకున్నారు. కానీ అది అలాంటి ప్రాజెక్టు కాదు అని రామ్ చరణ్ అఫీషియల్ గా కూడా క్లారిటీ ఇచ్చేశాడు.ఇక రామ్ చరణ్ తేజ్ త్వరలోనే మరో తమిళ దర్శకుడితో కూడా సినిమా చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం తెలుస్తోంది.


ఇక ఆ దర్శకుడు మరెవరో కాదు. యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అని సమాచారం.. ఖైదీ మాస్టర్ సినిమాలతో మంచి క్రేజ్ అందుకున్న లోకేష్ గత కొంతకాలంగా కూడా తెలుగు హీరోలతో కూడా వర్క్ చేయాలని చర్చలు జరుపుతున్నాడు. ఇదివరకే ఇతను రామ్ చరణ్ తో కథ చర్చల్లో కూడా పాల్గొన్నాడు.ఇక రీసెంట్ గానే విక్రమ్ సినిమా ప్రమోషన్ లో లోకేష్ తన తదుపరి సినిమాలకు సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కొంతమంది యువ హీరోలతో బిగ్ మూవీస్ ప్లాన్ చేస్తున్నట్లుగా వివరణ ఇస్తూ.. అందులో ఒక హీరో కూడా డేట్స్ అడ్జస్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని అన్నారు. ఇక ఆ హీరో మరెవరో కాదు టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని కోలీవుడ్ మీడియాలో అనేక కథనాలు వెలువడుతున్నాయి. మరి రామ్ చరణ్ ఈ డైరెక్టర్ ప్రాజెక్టుకు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: