ప్రాజెక్ట్ హైప్ అలా పెంచేశారుగా..!!

P.Nishanth Kumar
ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ప్రాజెక్ట్ కే గురించి ఇప్పుడు వస్తున్న వార్తలు సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగే విధంగా ఉన్నాయి. ప్రభాస్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చూసిన రాధే శ్యామ్ చిత్రం వారిని ఎంతగానో నిరాశపరిచింది. దాంతో ఆ తర్వాత వచ్చే ప్రభాస్ సినిమాలు భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే అందరు ప్రాజెక్టుకే సినిమా ఏ విధంగా ఉండబోతుందో అన్న ఆసక్తి కనబరుస్తున్నారు. ఆ చిత్రం తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై ఒత్తిడి ఉందని చెప్పాలి.  ఆ వచ్చే చిత్రం కూడా భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవాలని అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైతే ప్రేక్షకుల ముందుకు వస్తున్న నెక్స్ట్ ప్రభాస్ సినిమా పై ఎలాంటి క్లారిటీ లేదు కానీ ఏ సినిమా వచ్చినా కూడా అది ఘనవిజయం సాధించిన అవసరమైతే ఎంతైనా ఉంది. ఇప్పటికే ఆదిపురుష్ సినిమా విడుదల తేదీ ఖరారు చేశారు. షూటింగ్ కూడా త్వరలోనే మళ్లీ మొదలు కాబోతుంది.

ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ కే సినిమాకు సంబంధించి ఇటీవలే నాగ్ అశ్విన్ సోషల్ మీడియా ద్వారా స్పందించడం ఈ సినిమాపై అంచనాలను పెంచుతుంది అని చెప్పారు. విడుదల వచ్చే ఏడాది చివరలో కనుక ఈ సినిమా పూర్తి కావడానికి ఆయన సమయం ఉందని మాట్లాడుతున్నారు. ఏం జరిగినా కూడా ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేయడం ఖాయం అని ఆయన వ్యాఖ్యలు చేశాడు. ఇది అంచనాలు పెరిగినట్లు అయ్యింది. మరోవైపు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు అని అంటున్నారు. మరి ఈ సినిమా కనుక పట్టాలెక్కితే మరి కొన్ని రోజులు ప్రాజెక్టు కే చిత్రం వాయిదా పడే అవకాశం లేకపోలేదు. మరి ప్రభాస్ సినిమాల విషయంలో క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: