మహేష్ సినిమాలకే ఇలా జరుగుతుంది..!!

P.Nishanth Kumar
ఇటీవల కాలంలో ఎవరైనా పెద్ద హీరో సినిమా విడుదల అయితే వేరొక హీరో అభిమానులు ఆ సినిమాను ప్లాప్ అని ప్రపంచానికి చూపించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియా ను ఆధారంగా చేసుకొని సదరు హీరో చిత్రం డిజాస్టర్ అనే విధంగా మొదటి రోజు నుంచే టాక్ తీసుకువస్తున్నారు. దాని వల్ల ఆ హీరోకి ఆ చిత్ర నిర్మాతకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఆ విధంగా మహేష్ బాబు సినిమా రిలీజ్ అయింది అంటే ఎలాంటి వాదనలు రోజురోజుకు ఎక్కువై పోతున్నాయి

గతంలో ఆయన చేసిన సినిమా సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదలైన సమయంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. మహేష్ లాంటి పెద్ద హీరో సినిమా విడుదల అయితే కలెక్షన్ల గొడవ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఆయన సినిమాలకు సంబంధించిన నిర్మాతలు కలెక్షన్లను ఎక్కువ చేసి చూపించడం పెద్ద పెద్ద ఫిగర్లు వేసి పోస్టర్లు విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే మహేష్ సినిమాల విషయంలో ఇది మరీ తేలిపోతుంది అంటున్నారు. వాస్తవం గా వచ్చే కలెక్షన్స్ కు పోస్టర్ పై వేసే కలెక్షన్స్ కు  అసలు సంబంధం ఉండట్లేదు అనే చర్చ అంతకంతకూ పెరుగుతోంది.

ఈ విషయం పక్కన పెడితే టాప్ హీరోల్లో మహేష్ బాబు ముందు ఉంటాడు అని చెప్పాలి. ఆయన సినిమా ఎంత బాగున్నా కూడా మొదటి తొలి వారం ఆ సినిమాకు ఫ్లాప్ టాక్ వస్తోంది తద్వారా మహేష్ నెలకొల్పిన రికార్డులు తగ్గిపోతుంటాయి. అయినప్పటికీ ఆయన తన ఇమేజ్ తో ఇప్పటిదాకా చేసిన సినిమాలను భారీ కలెక్షన్లు వచ్చేలా చేసుకున్నాడు. మరి ఎందుకు ఇతర హీరోల అభిమానులు మహేష్ సినిమాపై ఇంత కక్ష సాధింపు చేస్తున్నారో అర్థం కావడం లేదు. సర్కారు వారి పాట సినిమా టాక్ కు ఆశ్చర్యపోయేలా ఆ చిత్రానికి కలెక్షన్లు వస్తున్నాయి. ఫ్లాప్ టాక్ తీసుకువచ్చిన కూడా దీనికి వేరే స్థాయిలో కలెక్షన్లు రావడం పట్ల మహేష్ బాబు సినిమాలకు ఈ విధమైన ప్రచారం ఎందుకు జరుగుతుందో అనే చర్చ ఇప్పుడు మొదలైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: